Tomato For Face : ట‌మాటాల‌తో ఇలా చేస్తే చాలు.. ఎండ వ‌ల్ల న‌ల్ల‌గా మారిన చ‌ర్మం.. తెల్ల‌గా అవుతుంది..!

Tomato For Face : మ‌న‌లో చాలా మందికి ఎండ‌లో తిర‌గ‌డం వ‌ల్ల చ‌ర్మం న‌ల్ల‌గా మారుతూ ఉంటుంది. ఎండ నుండి, యువి కిర‌ణాల నుండి చ‌ర్మం త‌నని తాను ర‌క్షించుకోవ‌డానికి మెల‌నిన్ ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేస్తుంది. దీంతో చ‌ర్మం న‌ల్ల‌గా మారిపోతూ ఉంటుంది. చ‌ర్మంపై ట్యాన్ పేరుకుపోవ‌డంతో పాటు చ‌ర్మం కూడా క‌మిలిపోతూ ఉంటుంది. క‌నుక వీలైనంత త‌క్కువ‌గా బ‌య‌ట తిర‌గాలి. చ‌ర్మంపై నేరుగా ఎండ ప‌డ‌కుండా చూసుకోవాలి. యువి కిర‌ణాల కార‌ణంగా చ‌ర్మం దెబ్బ‌తినకుండా చూసుకోవాలి.

ఎండ‌లో తిర‌గ‌డం వ‌ల్ల చ‌ర్మం న‌ల్ల‌గా మార‌డంతో పాటు చ‌ర్మం పొడిబారుతుంది. క‌నుక చ‌ర్మాన్ని ఎల్ల‌ప్పుడూ తాజాగా, తేమ ఉండేలా చూసుకోవాలి. అలాగే చాలా మంది ముఖంపై ఏర్ప‌డిన ట్యాన్ ను తొల‌గించుకోవ‌డానికి చ‌ర్మాన్ని తిరిగి సాధార‌ణ రంగుకు తీసుకురావ‌డానికి అనేక ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. చాలా మంది ఎండ‌లో తిర‌గాల్సి వ‌చ్చిన‌ప్పుడు స‌న్ స్క్రీన్ లోష‌న్స్ వాడుతూ ఉంటారు. వీటిని వాడిన‌ప్ప‌టికి చ‌ర్మం న‌ల్ల‌గా మారిపోతూ ఉంటుంది. అయితే వీటికి బ‌దులుగా ఇప్పుడు చెప్పే చ‌క్క‌టి చిట్కాను పాటించ‌డం వ‌ల్ల ఎండ వ‌ల్ల న‌ల్ల‌గా మారిన చ‌ర్మం తిరిగి సాధార‌ణ స్థితికి వ‌స్తుంది. అలాగే చ‌ర్మం తాజాగా, తేమ‌గా ఉంటుంది.

Tomato For Face how to use it to remove sun tan
Tomato For Face

ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ట‌మాట‌ను, నిమ్మ‌ర‌సాన్ని, పేస్ట్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఒక గిన్నెలో ట‌మాట ర‌సం, నిమ్మ‌ర‌సం, తెల్ల‌ని పేస్ట్ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించాలి. దీనిని అర‌గంట పాటు అలాగే ఉంచిన త‌రువాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై పేరుకుపోయిన న‌లుపుద‌నం తొల‌గిపోతుంది. ఈ చిట్కాను వారానికి రెండు సార్లు పాటించ‌డం వ‌ల్ల ఎండ వ‌ల్ల చ‌ర్మం దెబ్బ‌తిన‌కుండా ఉంటుంది. అలాగే ఎండ వ‌ల్ల న‌ల్ల‌గా మారిన చ‌ర్మం తిరిగి సాధార‌ణ రంగుకు వ‌స్తుంది.

D

Recent Posts