Toothpaste For Blackheads : మనలో చాలా మంది ముఖంపై బ్లాక్ హెడ్స్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా యువత ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ముక్కు, చంపలు, నుదురు వంటి భాగాల్లో వస్తూ ఉంటాయి. జిడ్డు చర్మం ఉన్నవారిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం, చర్మంపై మురికి, దుమ్ము, ధూళి, మృతకణాలు పేరుకుపోవడం వంటి వాటి వల్ల ముఖంపై బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. బ్లాక్ హెడ్స్ వల్ల మనకు ఎటువంటి హాని కలగనప్పటికి వీటి వల్ల ముఖం అందవిహీనంగా కనబడుతుంది.
బ్లాక్ హెడ్స్ సమస్య నుండి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లభించే స్క్రబ్స్ ను, స్ట్రిప్స్ వంటి వాటిని అలాగే అనేక రకాల ఫేస్ మాస్క్ లను వాడుతూ ఉంటారు. వీటిని వాడే అవసరం లేకుండా కేవలం రెండంటే రెండు పదార్థాలను ఉయోగించి చాలా సులభంగా మన ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు. ఈ చిన్న చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. పైగా చాలా సులభంగా బ్లాక్ హెడ్స్ సమస్య నుండి బయటపడవచ్చు. ఈ చిన్న చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ఉప్పును, తెల్లగా ఉండే టూత్ పేస్ట్ ను ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా ఒకగిన్నెలో కొద్దిగా ఉప్పు, టూత్ పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ముఖానికి నీటితో ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టిన తరువాత ముందుగా తయారు చేసుకున్న టూత్ పేస్ట్ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ పై రాసి మర్దనా చేయాలి. దీనిని మరో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ చాలా సులభంగా తొలగిపోతాయి. ఈ చిట్కాను క్రమం తప్పకుండా రోజూ పాటించడం వల్ల చాలా త్వరగా ఈ సమస్య నుండి బయట పడవచ్చు. బ్లాక్ హెడ్స్ సమస్యతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.