Vanilla Cool Cake : ఓవెన్ లేకున్నా స‌రే.. వెనిల్లా కూల్ కేక్‌ను ఇంట్లోనే ఇలా చేసుకోండి..!

Vanilla Cool Cake : మ‌న‌కు బేక‌రీలల్లో ల‌భించే వాటిలో కేక్ కూడా ఒక‌టి. కేక్ లో చాలా వెరైటీలు ఉంటాయి. వాటిలో కూల్ కేక్ కూడా ఒక‌టి. ఈ కూల్ కేక్ చ‌ల్ల చ‌ల్ల‌గా, నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా ఉంటుంది. పిల్లలు, పెద్ద‌లు అందరూ ఈ కూల్ కేక్ ను ఇష్టంగా తింటారు. అయితే బ‌య‌ట ల‌భించే ఈ కూల్ కేక్ ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కేక్ ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మొద‌టిసారి చేసే వారు కూడా ఈ కేక్ ను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌య‌ట బేక‌రీల‌ల్లో ల‌భించే ఈ కూల్ కేక్ ను అదే రుచితో ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెనీలా కూల్ కేక్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కోడిగుడ్లు – 2, పంచ‌దార – అర క‌ప్పు, నూనె – పావు క‌ప్పు, కాచి చ‌ల్లార్చిన పాలు – పావు క‌ప్పు, వెనీలా ఎసెన్స్ – కొద్దిగా, మైదాపిండి – ఒక క‌ప్పు, వంట‌సోడా – అర టీ స్పూన్, బేకింగ్ పౌడ‌ర్ – ఒక టీ స్పూన్.

Vanilla Cool Cake recipe in telugu make in this method
Vanilla Cool Cake

క్రీమ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ‌ట‌ర్ – 100 గ్రా., క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్ – 1/3 క‌ప్పు, కాచి చ‌ల్లార్చిన పాలు – 2 టేబుల్ స్పూన్స్.

షుగ‌ర్ సిరప్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పంచ‌దార – పావు క‌ప్పు, నీళ్లు – అర క‌ప్పు.

వెనీలా కూల్ కేక్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్లు వేసి 5నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. త‌రువాత ఇందులో పంచ‌దార‌, పాలు, నూనె, వెనీలా ఎసెన్స్ వేసి క‌ల‌పాలి. త‌రువాత గిన్నెపై జ‌ల్లెడను ఉంచి అందులో మైదాపిండి, వంట‌సోడా, బేకింగ్ పౌడ‌ర్ వేసి జ‌ల్లించాలి. ఇప్పుడు అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత కేక్ ట్రేను తీసుకుని దానికి నూనె రాయాలి. త‌రువాత మైదాపిండితో డ‌స్టింగ్ చేసుకుని అందులో కేక్ మిశ్ర‌మాన్ని వేసుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో స్టాండ్ ను ఉంచి దానిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఫ్రీహీట్ చేసుకోవాలి. త‌రువాత కేక్ గిన్నెను స్టాండ్ పై ఉంచి మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై 30 నుండి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. త‌రువాత గిన్నెను బ‌య‌ట‌కు తీసి చ‌ల్లారిన త‌రువాత కేక్ ను ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క్రీమ్ కోసం గిన్నెలో బ‌ట‌ర్ ను తీసుకుని 10 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. త‌రువాత ఇందులో క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్ ను కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాగా క‌లుపుకోవాలి. త‌రువాత పాలు పోసి క్రీమ్ లా అయ్యే వ‌ర‌కు బాగా బీట్ చేసుకోవాలి.

త‌రువాత షుగ‌ర్ సిర‌ప్ కోసం గిన్నెలో పంచ‌దార‌, నీళ్లు పోసి పంచ‌దార క‌రిగే వ‌ర‌కు క‌ల‌పాలి. ఇప్పుడు ముందుగా త‌యారు చేసుకున్న కేక్ ను అడ్డంగా మూడు స‌మాన భాగాలుగా క‌ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ ను తీసుకుని దానిపై కొద్దిగా క్రీమ్ ను రాసుకోవాలి. త‌రువాత దీనిపై అడుగున ఉండే కేక్ లేయ‌ర్ ను ఉంచి దానిపై షుగ‌ర్ సిర‌ప్ ను చ‌ల్లుకోవాలి. కేక్ అంతా షుగ‌ర్ సిర‌ప్ తో త‌డిసిన త‌రువాత దానిపై క్రీమ్ ను రాసుకోవాలి. త‌రువాత దీనిపై మ‌రో కేక్ లేయ‌ర్ ను ఉంచి మ‌ర‌లా షుగ‌ర్ సిర‌ప్, క్రీమ్ ను రాసుకోవాలి. చివ‌ర‌గా దానిపై మ‌రో కేక్ లేయ‌ర్ ను ఉంచి కేక్ అంతా క్రీమ్ ను రాసుకోవాలి. త‌రువాత కేక్ పై మ‌న‌కు న‌చ్చిన‌ట్టుగా డెక‌రేట్ చేసుకోవాలి. త‌రువాత ఈ కేక్ ను అర‌గంట లేదా గంట పాటు ఫ్రిజ్ లో ఉంచి ఆ త‌రువాత కట్ చేసి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెనీలా కూల్ కేక్ త‌యార‌వుతుంది. బ‌య‌ట కొనే ప‌నిలేకుండా ఇలా ఇంట్లోనే కేక్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ కేక్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు.

Share
D

Recent Posts