Ankapur Chicken : అన్నం, చ‌పాతీల్లోకి అదిరిపోయే.. అంకాపూర్ చికెన్‌.. త‌యారీ ఇలా..!

Ankapur Chicken : అంకాపూర్ చికెన్.. తెలంగాణాలోని అంకాపూర్ లో ల‌భించే ఈ చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. నాటుకోడితో చేసే ఈ చికెన్ కర్రీని రుచిచూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఈ చికెన్ క‌ర్రీని వీలైనంత కిలో కంటే త‌క్కువ బ‌రువు ఉండే నాటుకోడితో త‌యారు చేయాలి. అప్పుడే ఈ క‌ర్రీ మ‌రింత రుచిగా ఉంటుంది. ఈ అంకాపూర్ చికెన్ క‌ర్రీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. త‌ర‌చూ ఒకే ర‌కం చికెన్ క‌ర్రీ తిని తిని బోర్ కొట్టిన వారు ఇలా వెరైటీగా ట్రై చేయ‌వ‌చ్చు. అంకాపూర్ చికెన్ క‌ర్రీని మ‌న ఇంట్లో ఏ విధంగా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

అంకాపూర్ చికెన్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

లేత నాటుకోడి చికెన్ – కిలో, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – 4 నుండి 5 స్పూన్స్, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, నూనె – 5 టేబుల్ స్పూన్స్, స్టోన్ ప్ల‌వ‌ర్ – కొద్దిగా, బిర్యానీ ఆకు – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన మెంతికూర – గుప్పెడు, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ‌లు -2, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 10, ఎండుకొబ్బ‌రి పొడి – 3 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Ankapur Chicken recipe in telugu make in this method
Ankapur Chicken

మసాలా పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క‌, యాల‌కులు – 15, ల‌వంగాలు – 15, అనాస పువ్వు – 1, జాపత్రి – 1, మిరియాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, సాజీరా – పావు టీ స్పూన్, నువ్వులు – 2 టీ స్పూన్స్.

అంకాపూర్ చికెన్ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో చికెన్ ను తీసుకుని అందులో ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో మ‌సాలా పొడికి కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. త‌రువాత చిన్న‌గా ఉండే గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత స్టోన్ ప్ల‌వ‌ర్, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. త‌రువాత క‌రివేపాకు, మెంతికూర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత చికెన్ వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై గిన్నెను ఉంచి అందులో 4 క‌ప్పుల నీళ్లు పోయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆవిరి బ‌య‌ట‌కు పోకుండా ముక్క‌లు మెత్త‌గా ఉడుకుతాయి.

ఈ కూర‌ను మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ చికెన్ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. చికెన్ ఉడికిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు వేడి నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అంకాపూర్ చికెన్ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, రోటీ, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ ఒకే విధంగా కాకుండా నాటుకోడితో ఇలా కూడా వండుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts