Tomato Face Pack : అందంగా కనిపించాలని మనలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందంగా కనబడడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు కూడా. కానీ వాతావరణ కాలుష్యం, ఎండలో ఎక్కువగా తిరగడం, రసాయనాలు కలిగిన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడడం వంటి కారణాల వల్ల చర్మం మరింత నల్లగా మారుతుంది. చర్మంపై ఉండే ఈ నలుపును పోగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఖరీదైన క్రీములను, ఫేస్ వాష్ లను వాడడం, ముఖానికి బ్లీచింగ్ చేయడం వంటి అనేక రకాల పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తాత్కాలికమైన ప్రయోజనం మాత్రమే ఉంటుంది.
అంతేకాకుండా చర్మం పొడిబారడం వంటి చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే మనం చాలా సులువుగా చర్మంపై ఉండే నలుపును పోగొట్టుకోవచ్చు. చర్మంపై ఉండే నలుపును పోగొట్టి ముఖాన్ని కాంతివంతంగా తయారు చేసే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మనం ముందుగా 2 టేబుల్ స్పూన్ల టమాట గుజ్జును, ఒక టీ స్పూన్ కలబంద గుజ్జును, చిటికెడు ఉప్పును, చిటికెడు పసుపును, 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా ఒక గిన్నెలో పైన తెలిపిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా రాసుకున్న మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత కడిగేయాలి. నీటితో కడిగిన తరువాత ముఖాన్ని మెత్తని టవల్ తో సున్నితంగా తుడుచుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ముఖంపై ఉండే నలుపుతోపాటు మొటిమలు, మచ్చలు, ముడతలు కూడా తొలగిపోతాయి. చర్మం పై ఉండే నలుపుదనం పోయి ముఖం కాంతివంతంగా తయారువుతుంది. ఈ చిట్కాని వారానికి ఒకసారి పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇందులో మనం సహజసిద్ధ పదార్థాలను ఉపయోగించాం. కనుక చర్మానికి ఎటువంటి హాని కలగదు.