Betel Leaves For Hair : త‌మ‌ల‌పాకుల‌తో ఇలా చేస్తే చాలు.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..!

Betel Leaves For Hair : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో ఒక హెర్బ‌ల్ ఆయిల్ ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. నేటి త‌రుణంలో జుట్టు స‌మ‌స్య‌ల‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. జుట్టు రాల‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం, జుట్టు చిట్ల‌డం, జుట్టు పెరుగుద‌ల ఆగిపోవ‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువవుతున్నారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, పోష‌కాహార లోపం, ర‌సాయనాలు క‌లిగిన షాంపులను వాడ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

మ‌న ఇంట్లోనే చ‌క్క‌టి హెర్బల్ ఆయిల్ ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటిని దూరం చేసుకోవ‌చ్చు. జుట్టును ఒత్తుగా, న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. జుట్టు రాల‌డం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. జుట్టు రాల‌డాన్ని తగ్గించే ఈ నూనెను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా మ‌నం 3 త‌మ‌ల‌పాకుల‌ను, గుప్పెడు క‌రివేపాకును, 200 ఎమ్ ఎల్ కొబ్బ‌రి నూనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా త‌మ‌ల‌పాకును ముక్క‌లుగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో క‌రివేపాకు, నూనె వేసి వేడి చేయాలి. ఈ నూనెను మ‌ధ్య‌స్థ మంట‌పై ఆకులు న‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు వేడి చేసి వ‌డ‌క‌ట్టాలి.

Betel Leaves For Hair how to use them
Betel Leaves For Hair

ఇలా త‌యారు చేసుకున్న నూనెను జుట్టు కుదుళ్ల‌కు బాగా ప‌ట్టించాలి. త‌రువాత నూనెను కుదుళ్ల‌ల్లోకి ఇంకేలా మ‌ర్ద‌నా చేసుకోవాలి. త‌రువాత దీనిని గంట నుండి రెండు గంట పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత ర‌సాయ‌నాలు త‌క్కువ‌గా ఉండే షాంపుతో లేదా హెర్బ‌ల్ షాంపుతో త‌లస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. తెల్ల జుట్టు క్ర‌మంగా న‌ల్ల‌గా మారుతుంది. ఈ చిట్కాను ఈ విధంగా వాడ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ దూరం చేసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts