Body Detox : ఒక్క రోజులో మీ శ‌రీరాన్ని లోప‌లి నుంచి ఇలా శుభ్రం చేయండి..!

Body Detox : మ‌నం తీసుకునే ఆహారం ద్వారా మ‌న శ‌రీరానికి శ‌క్తి లభిస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భిస్తేనే మ‌నం రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోగ‌లుగుతాము. అయితే మ‌నం తీసుకునే ఆహారం ద్వారా మ‌న శ‌రీరంలోకి వివిధ మ‌లినాలు ప్ర‌వేశిస్తాయి. అలాగే నూనె ప‌దార్థాలు, జంక్ ఫుడ్ తీసుకునే వారి శ‌రీరంలోకి ఈ మ‌లినాలు ఎక్కువ‌గా మ‌రింత ఎక్కువ‌గా ప్ర‌వేశిస్తాయి. ఇవి ప్రేగుల‌కు అతుక్కుపోయి జీర్ణ వ్య‌వ‌స్థ నెమ్మ‌దించేలా చేస్తాయి. అలాగే శ‌రీరంలో చెడు బ్యాక్టీరియా ఎక్కువ‌గా పెరిగేలా చేస్తాయి. ఒక‌వేళ జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తీసుకునే వారిలో క‌చ్చితంగా జీర్ణ స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అదే విధంగా ధూమ‌పానం చేసే వారిలో కూడా శ‌రీరంలో మ‌లినాలు ఎక్కువ‌గా ఉంటాయి.

మ‌నం తీసుకునే ఆహారం అలాగే ధూమ‌పానం ద్వారా మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశించే ఈ మ‌లినాలు ర‌క్తం ద్వారా శ‌రీరంలోని అన్ని భాగాల‌కు చేరుతాయి. ఈ మ‌లినాలు ఎక్కువ‌గా చేర‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డతాయి. అలాగే మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య త‌లెత్తుతుంది. చ‌ర్మంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. అలాగే కొన్ని ర‌కాల శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. క‌నుక శ‌రీరంలో ఉండే మ‌లినాలను ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గించుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం ఆరోగ్య‌వంతంగా త‌యార‌వుతుంది. మ‌నం ఉత్సాహంగా ప‌ని చేసుకోగ‌లుగుతాము. జీర్ణ‌వ్య‌వ‌స్థ కూడా మెరుగుప‌డుతుంది. క‌నుక మ‌నం ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఆరోగ్యవంతంగా ఉండ‌వ‌చ్చు.

Body Detox simple home remedies follow these
Body Detox

శ‌రీరంలో మ‌లినాలను తొల‌గించే కొన్ని చిట్కాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరంలో మ‌లినాలు ఎక్కువ‌గా పేరుకుపోయిన వారు నీటిని ఎక్కువ‌గా తాగాలి. నీటిని ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల మ‌లినాలుమూత్రం, చెమ‌ట ద్వారా బ‌య‌ట‌కు పోతాయి. అలాగే మూత్ర‌పిండాలు కూడా శుభ్ర‌ప‌డ‌తాయి. ర‌క్తంలో ఉండే మ‌లినాలు తొల‌గిపోతాయి. రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీటిని త‌ప్ప‌కుండా తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే మ‌లినాలు సుల‌వుగా తొల‌గిపోతాయి. అదే విధంగా వారానికి ఒక‌రోజు ఉప‌వాసం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ప్రేగులు, జీర్ణ‌వ్య‌వ‌స్థలో పేరుకుపోయిన మ‌లినాలు తొల‌గిపోతాయి. అదే విధంగా ప్ర‌తిరోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా మనం శ‌రీరంలో ఉండే మలినాల‌ను తొల‌గించుకోవ‌చ్చు. ఏదో ఒక వ్యాయామం చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే వ్యర్థాలు చెమ‌ట ద్వారా బ‌య‌ట‌కు పోతాయి.

రోజుకు 20 నుండి 30 నిమిషాల పాటు ఎక్కువ‌గా చెమ‌ట ప‌ట్టేలా ఏదో ఒక వ్యాయామం చేయాలి. అదే విధంగా రోజూ ఒక గ్లాస్ నిమ్మ‌కాయ నీటిని తాగాలి. నిమ్మ‌కాయ‌లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. ఇది శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. చ‌ర్మాన్ని, ఎముకల‌ను ఆరోగ్యంగా ఉండ‌చంలో కూడా విట‌మిన్ సి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఒక గ్లాస్ నిమ్మ‌కాయ నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలోని మ‌లినాలు తొల‌గిపోతాయి. రక్తం శుద్ది అవుతుంది. శ‌రీరం శుభ్ర‌ప‌డుతుంది. అలాగే ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ద్వారా మ‌లినాలు ర‌క్తంలో క‌ల‌వ‌కుండా ఉంటాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ శుభ్ర‌ప‌డుతుంది. ఈ విధంగా ఈచిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా మ‌నం శ‌రీరాన్ని శుభ్ర‌ప‌రుచుకోవ‌చ్చు. శ‌రీరంలో ఉండే మ‌లినాలను తొల‌గించుకోవ‌చ్చు.

D

Recent Posts