Cardamom Powder For High BP : మనల్ని అధికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలల్లో బీపీ ఒకటి. దీనిని సైలెంట్ కిల్లర్ గా అభివర్ణించవచ్చు. ఎటువంటి నొప్పి తెలియకుండా మనిషి ప్రాణాన్ని తీయడానికి బీపీ కారణమవుతుంది. అలాగే పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతినడం, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తడానికి కూడా బీపీ ప్రధాన కారణం. దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరిని ఈ సమస్య వేధిస్తుంది. అలాగే 80 శాతం మందిలో ఈ బీపీ నియంత్రణలో లేకుండా పోతుంది. అయితే చాలా మంది ఈ సమస్యను ముందుగానే గుర్తించలేకపోతున్నారని వైద్యులు చెబుతున్నారు. 25 సంవత్సరాలు పైబడిన వారంతా రక్తపోటు పరీక్షలను అప్పుడప్పుడూ చేయించుకుంటూ ఉండాలి. ఈ పరీక్షల్లో బీపీ ఉందని తెలియగానే వెంటనే మందులు వాడకుండా సహజ సిద్దంగా దీనిని తగ్గించుకోవచ్చు. బీపీ ఉందని తెలియగానే వెంటనే మందులు వాడడానికి బదులుగా సహజంగా తగ్గించుకోవడానికి ప్రయత్నించడం ఉత్తమం.
స్టేజ్ 1 అనగా 120/80 నుండి 129/85 మధ్యలో బీపీ ఉంటే వెంటనే మందులు వాడకుండా కేవలం రెండు నెలల్లోనే బీపీని సాధారణ స్థితికి వచ్చేలా చేయవచ్చు. కేవలం ఒకే ఒక్క పదార్థాన్నీ వాడి మనం బీపీని నియంత్రించుకోవచ్చు. బీపీని నియంత్రించే ఆ పదార్థం మరేమిటో కాదు యాలకుల పొడి. దీనిని అందరూ సులభంగా ఉపయోగించవచ్చు. ప్రారంభ దశలో ఉన్న బీపీని యాలకుల పొడి తగ్గిస్తుందని నిపుణులు సైతం చెబుతున్నారు. రోజుకు రెండు పూటలా పూటకు 3 గ్రాముల చొప్పున యాలకుల పొడిని తీసుకోవడం వల్ల కేవలం రెండు నెలల్లోనే బీపీ నియంత్రణలోకి వస్తుందని వారు చెబుతున్నారు. ప్రారంభ దశలో బీపీ ఉన్న వారు ఈ యాలకుల పొడిని వాడడం వల్ల ఎటువంటి మందులు ఉపయోగించే పని లేకుండా బీపీని నియంత్రించుకోవచ్చు.
అలాగే హైబీపీతో బాధపడే వారు కూడా ఈ యాలకులను తీసుకోవడం వల్ల బీపీ నియంత్రణలోకి వస్తుందని వారు చెబుతున్నారు. యాలకుల పొడిని తీసుకోవడం వల్ల బీపీ తగ్గడంతో పాటు మరో ప్రయోజనాన్ని కూడా మనం పొందవచ్చు. యాలకుల పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ ఆకసిడెంట్ల స్థాయిలు పెరుగుతాయని వారు చెబుతున్నారు. శరీరంలో కణజాలాలు దెబ్బతినకుండా చేయడానికి అలాగే శరీరంలో తయారయ్యే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో, శరీరాన్ని జబ్బుల బారిన పడకుండా చేయడంలో ఈ యాంటీ ఆక్సిడెంట్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విధంగా యాలకుల పొడిని తీసుకోవడం వల్ల ప్రారంభ దశలో ఉన్న బీపీ తగ్గుతుంది. హైబీపీ నియంత్రణలోకి వస్తుంది. అలాగే ఈ విధంగా యాలకుల పొడిని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో బీపీ రాకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.