Cough Home Remedy : ఛాతిలో క‌ఫం, ద‌గ్గు.. చిటికెలో మాయం.. ఇలా చేయాలి..!

Cough Home Remedy : వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడల్లా చాలా మంది ద‌గ్గు, క‌ఫం వంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. ఇవి చూడ‌డానికి సాధార‌ణంగానే ఉన్న‌ప్ప‌టికి వీటి కార‌ణంగా క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ద‌గ్గు, క‌ఫం వంటి స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌డానికి చాలా మంది సిర‌ప్ ల‌ను, మందుల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల కొంద‌రిలో స‌మ‌స్య నుండి తాత్కాలిక ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. కానీ కొంద‌రిలో మందులు వాడిన‌ప్ప‌టికి ఎటువంటి ఫ‌లితం ఉండ‌దు. అలాగే ఈ మందుల‌ను వాడ‌డం వ‌ల్ల దుష్ప్ర‌భావాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. కేవ‌లం మందుల‌తోనే కాకుండా ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి కూడా మ‌నం ద‌గ్గు, క‌ఫం వంటి స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా తేలిక‌. అలాగే ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

ద‌గ్గు, క‌ఫం వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే చిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్ల‌ను పోసి వేడి చేయాలి. ఇందులోనే మూడు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకుని వేసుకోవాలి. త‌రువాత ఈ నీటిలోనే ప‌ది మిరియాల‌ను క‌చ్చా ప‌చ్చాగా దంచి వేసుకోవాలి. త‌రువాత ప‌ది ల‌వంగాల‌ను, ఒక ఇంచు అల్లం ముక్క‌ను క‌చ్చా ప‌చ్చాగా దంచి వేసుకోవాలి. త‌రువాత ఇందులోనే 6 లేదా 7 తుల‌సి ఆకుల‌ను అర గుప్పెడు పుదీనా ఆకుల‌ను, పావు టీ స్పూన్ ప‌సుపును వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఒక గ్లాస్ క‌షాయం అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. త‌రువాత దీనిని వ‌డ‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకుని గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత కాఫీలా కొద్ది కొద్దిగా తాగాలి.

Cough Home Remedy works effectively know how to use it
Cough Home Remedy

ఇలా రెండు నుండి మూడు రోజుల పాటు ఈ క‌షాయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల ద‌గ్గు, క‌ఫం వంటి స‌మ‌స్య‌ల నుండి స‌త్వ‌ర ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు. ఈ క‌షాయం త‌యారీలో వాడిన ప‌దార్థాల‌న్నీ మ‌న వంటింట్లో ఉండేవే. వీటిలో యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాలతో పాటు ఔష‌ధ గుణాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి. ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి ద‌గ్గు, క‌ఫంతో పాటు జలుబు, గొంతు నొప్పి, గొంతులో గ‌ర‌గ‌ర వంటి వివిధ ర‌కాల శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల నుండి కూడా మ‌నం ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు. అలాగే ఈ క‌షాయాన్ని పిల్ల‌ల‌కు కూడా ఇవ్వ‌వ‌చ్చు. ద‌గ్గు, క‌ఫం వంటి స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతున్న‌ప్పుడు మందుల‌ను వాడ‌డానికి బ‌దులుగా ఇలా ఇంట్లోనే క‌షాయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts