Saggubiyyam Breakfast : స‌గ్గుబియ్యంతో ఎంతో ఆరోగ్య‌క‌రమైన బ్రేక్‌ఫాస్ట్‌.. ఇలా చేయాలి..!

Saggubiyyam Breakfast : స‌గ్గు బియ్యాన్ని కూడా మం ఆహారంలో భాగంగా తీసుకుంటాము. స‌గ్గు బియ్యం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. స‌గ్గు బియ్యంతో మ‌నం ఎక్కువ‌గా పాయసం త‌యారీలో ఉప‌యోగిస్తూ ఉంటాం. కేవ‌లం పాయాసాన్నే కాకుండా వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే బ్రేక్ ఫాస్ట్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేసే స‌గ్గు బియ్యం బ్రేక్ ఫాస్ట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. అలాగే స‌గ్గు బియ్యంతో చేసే ఈ వంట‌కాన్ని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా పొంద‌వ‌చ్చు. స‌గ్గుబియ్యంతో రుచిగా బ్రేక్ ఫాస్ట్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

స‌గ్గు బియ్యం బ్రేక్ ఫాస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స‌గ్గు బియ్యం – ఒక క‌ప్పు, నీళ్లు – ఒక క‌ప్పు, ప‌ల్లీలు – రెండు టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, అల్లం – ఒక ఇంచు ముక్క‌, ప‌చ్చిమిర్చి – 2, కొత్తిమీర – ఒక క‌ప్పు, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, బంగాళాదుంప – 1( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది), బియ్యం పిండి – 3 టీ స్పూన్స్.

Saggubiyyam Breakfast recipe in telugu very healthy and tasty
Saggubiyyam Breakfast

స‌గ్గు బియ్యం బ్రేక్ ఫాస్ట్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో స‌గ్గు బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత అందులో నీళ్లు పోసి గంట‌న్న‌ర పాటు నాన‌బెట్టాలి. త‌రువాత ఒక క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించాలి. త‌రువాత వీటిపై ఉండే పొట్టును తీసి క‌చ్చా ప‌చ్చ‌గా దంచుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు ఒక జార్ లో అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు, ప‌చ్చిమిర్చి, జీల‌క‌ర్ర‌, ఉప్పు, కొత్తిమీర వేసి మెత్త‌గా పేస్ట్ లా చేసుకోవాలి. అలాగే బంగాళాదుంప‌పై ఉండే చెక్కును తీసి స‌న్న‌గా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నాన‌బెట్టుకున్న స‌గ్గు బియ్యాన్ని నీళ్లు లేకుండా తీసుకోవాలి. త‌రువాత ఇందులో దంచిన ప‌ల్లీలు, మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్, బంగాళాదుంప తురుము, బియ్యం పిండి వేసి బాగా క‌లుపుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ముందుగా త‌యారు చేసుకున్న స‌గ్గు బియ్యం మిశ్ర‌మాన్ని త‌గి మోతాదులో తీసుకుని ఉండలుగా చేసుకోవాలి.

త‌రువాత వీటిని మ‌సాలా వ‌డ ఆకారంలో వ‌త్తుకుని క‌ళాయిలో వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. వ‌డ‌ల ఆకారంలోనే కాకుండా ఈ స‌గ్గు బియ్యం మిశ్ర‌మాన్ని ఉండ‌లుగా చేసుకుని గుంత పొంగ‌నాల పెనంలో వేసి కాల్చుకుని తిన‌వ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స‌గ్గు బియ్యం బ్రేక్ ఫాస్ట్ త‌యార‌వుతుంది. కేవ‌లం అల్పాహారంగానే కాకుండా స్నాక్స్ గా కూడా వీటిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. స‌గ్గు బియ్యంతో చేసిన ఈ వంట‌కాన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు, ఉద‌యం పూట అల్పాహారంగా ఏం చేయాలో తోచ‌న‌ప్పుడు ఇలా స‌గ్గు బియ్యంతో బ్రేక్ ఫాస్ట్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts