Cumin For Weight Loss : పలు రకాల ప్రత్యేక వంటకాలలో మసాలా దినుసులు ఏవిధమైన పాత్ర పోషిస్తాయో అందరికీ తెలిసిందే. ఆ దినుసులు లేకుండా వంటకాలకు రుచి, వాసన రాదు. అలాంటి దినుసుల్లో జీలకర్ర కూడా ఒకటి. దీన్ని చాలా వంటల్లో వేస్తారు. అయితే ఇది వంటల్లో రుచి, సువాసనను మాత్రమే కాదు, మనకు పలు ఆరోగ్యకర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. జీలకర్రలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ క్రమంలో జీలకర్రను ఉపయోగించి తయారు చేసే పలు ఔషధాల సహాయంతో అధిక బరువును ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక గ్లాస్ నీటిని పాత్రలో తీసుకుని అందులో టీస్పూన్ జీలకర్రను వేయాలి. ఆ నీటిని బాగా మరిగించి చల్లార్చాలి. అలా వచ్చిన నీటిని వడకట్టి తాగాలి. ఈ నీటిని రోజుకు 3 సార్లు తాగితే చాలు, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అధికంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తీసి మరిగించి తాగాలి. అనంతరం నీటిలో నానిన ఆ జీలకర్రను తినేయాలి. దీంతో నెల రోజుల్లోనే పొట్ట కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. జీలకర్రను 5 గ్రాముల మోతాదులో తీసుకుని పొడి చేయాలి. దాన్ని నిత్యం ఏదో ఒక సమయంలో ఒక కప్పు పెరుగులో కలుపుకుని తినాలి. దీంతో అధిక బరువు ఇట్టే తగ్గుతారు.
ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ తేనె, 3 గ్రాముల జీలకర్ర పొడి వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే పరగడుపున తాగాలి. దీంతో ఒంట్లో ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. క్యారెట్లను బాగా ఉడకబెట్టాలి. వాటిపై నిమ్మ, వెల్లుల్లి రసం, జీలకర్ర పొడిలను చల్లాలి. అనంతరం ఆ క్యారెట్లను తినేయాలి. రోజూ రాత్రి డిన్నర్‌కు బదులుగా ఈ ఆహారం తింటే చాలు, కొద్ది రోజుల్లోనే బరువు తగ్గుతారు. ఇలా జీలకర్రను వివిధ రకాలుగా ఉపయోగించడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయట పడవచ్చు.