Curd And Egg For Hair : మన ఇంట్లో ఉండే రెండు పదార్థాలను ఉపయోగించి మనం మన జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఈ పదార్థాలతో హెయిర్ ప్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టు రాలడాన్ని, జుట్టు పొడిబారడాన్ని మనం తగ్గించుకోవచ్చు. జుట్టుకు కావల్సిన పోషకాలు, తేమ అందకపోవడం వల్ల జుట్టు సమస్యలు తలెత్తుతున్నాయి. జుట్టు సమస్యలతో బాధపడే వారు ఈ హెయిర్ ప్యాక్ ను వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. జుట్టు రాలడాన్ని తగ్గించే ఈ హెయిర్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దీనిని తయారు చేసుకోవడానికి కావల్సిన ఆ రెండు పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ హెయిర్ ప్యాక్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం పెరుగును, కోడిగుడ్డును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో అర కప్పు పెరుగును తీసుకోవాలి. తరువాత పెరుగును ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఇందులో కోడిగుడ్డును వేసి కలపాలి. పెరుగు, కోడిగుడ్డు అంతా కలిసేలా కలుపుకున్న తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టంతటికి పట్టించాలి. ఒక గంట లేదా గంటన్నర తరువాత గోరు వెచ్చని నీటితో లేదా సాధారణ నీటితో తలస్నానం చేయాలి. వేడి నీటిని తలస్నానం చేయడానికి ఉపయోగించకూడదు.
ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మనం చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చులో జుట్టు సమస్యలన్నింటిని దూరం చేసుకోవచ్చు. ఈ రెండు పదార్థాలు కూడా మనకు సహజంగానే లభించేవే. అలాగే వీటిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ హెయిర్ ప్యాక్ ను ఎవరైనా ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఈ హెయిర్ ప్యాక్ ను వాడడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా, కాంతివంతంగా తయారవుతుంది.