చిట్కాలు

ఇలా చేస్తే అరగంటలో జ్వరం తగ్గిపోవడం ఖాయం..!

జ్వరం వచ్చినప్పుడు చాలా మంది అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అది తగ్గే వరకు కూడా మనశ్శాంతి అనేది ఉండదు. ఒకరకంగా చెప్పాలి అంటే జ్వరం బ్రతికి ఉండగానే నరకం చూపిస్తుంది అనేది వాస్తవం. తగ్గడానికి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయినా సరే తగ్గదు. ఇక అది తగ్గే వరకు కూడా నీరసంగా ఉంటూ ఏది వచ్చినా జ్వరం రాకూడదు అనుకుంటూ ఉంటారు.

అయితే దీన్ని అరగంటలో తగ్గించవచ్చు అంటున్నారు. అది ఎలానో చూద్దాం. ఓ 200 గ్రాములు పెసరపప్పు తీసుకుని దాన్ని ఒకసారి కడిగి దాన్ని ఓ గిన్నెలో పోసి, గిన్నె నిండేలా నీరు 250 గ్రాములు లేదా 300 గ్రాములు పొయ్యాలి. జ్వరం తీవ్రతను బట్టీ, 20 నిమిషాలపాటూ పెసరపప్పును నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత పెసరపప్పును వడగట్టి, ఆ నీటిని గ్లాసులో పోసి పేషెంట్‌ తాగకపోయినా సరే తాగించండి.

do like this to reduce fever in just 30 minutes

అలా చేస్తే 10 నిమిషాల్లో క్రమంగా శరీరంలో వేడి తగ్గుతూ 20 నుంచీ 30 నిమిషాల్లో వేడి పూర్తిగా తగ్గుతుంది. అదే విధంగా జ్వరం వచ్చినప్పుడు మన నోట్లో ఉండే చేదు, చప్పదనం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఏమైనా తినాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ చెప్పిన మందులు కూడా వేసుకుంటే మీ జ్వరం తగ్గిపోతుంది.

పెసరపప్పుకు మన శరీరాన్ని చల్లబరిచే మంచి గుణం ఉంది. అందులో విటమిన్ బి, సి, మాంగనీస్, ప్రోటీన్లు ఎక్కువగా ఉండటంతో మన శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అందుకే చాలా ఇళ్లలో పెసర లడ్డూలు చేసి తింటారు. అవి మన శరీరంలో వేడిని కంట్రోల్ చేస్తాయి. వీలైతే వారానికి ఓసారైనా పెసరపప్పుతో వంటలు చేసి తినడం అనేది చాలా మంచిది అంటున్నారు వైద్యులు.

Admin

Recent Posts