Home Tips

ఇలా చేస్తే కచ్చితంగా మెహంది మరకలు పోతాయి..!

మెహంది పెట్టుకున్న చాలా మందికి బీపీ తెప్పించే విషయ౦. అది వెలిసిపోయి మరకల మాదిరిగా చిరాకుగా కనపడటం. అలా చూసుకున్న చాలా మందికి బీపీ కూడా వస్తుంది. ఎందుకు పెట్టుకున్నాం కర్మ కొద్దీ అనుకుంటారు జనం. ఆ మరకల గురించే దానికి దూరంగా ఉంటూ ఉంటారు చాలా మంది. ఇది వెలిసిపోయినప్పుడు పోగొట్టే చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవి తప్పక తెలుసుకోవాలి. టూత్ పేస్ట్ ద్వారా మీరు మెహంది మరకలను పోగొట్టుకోవచ్చు. మెహందీపై టూత్ పేస్టు ని పొరలా అప్లయ్ చేసి తర్వాత నీటితో కడిగితే మరకలు పోతాయి. టూత్ పేస్టు కి మరకలు పోగొట్టే గుణం ఉంది.

​యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్ ద్వారా కూడా పోగొట్టుకోవచ్చు. వీటిల్లో మెహందీని పోగొట్టే లక్షణాలు చాలానే ఉన్నాయి. చేతులకి రాసి 8 నుంచి 10 నిమిషాలు అయిన తర్వాత చేతులను కడిగేయాలి. అలాగే లోషన్స్ వలన కూడా పోయే అవకాశం ఉంటుంది. ​ఉప్పు నీరు ద్వారా కూడా మెహంది మరకలు పోయే అవకాశం ఉంటుంది. ఇది మంచి క్లెన్సింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. ఒక బౌల్‌లో కొద్దిగా నీరు తీసుకుని అందులో ఉప్పు వేసి బాగా కలిపి ఆ నీళ్ళల్లో చేతులు మునిగేలా ఉంచి 20 నిమిషాల తర్వాత బయటకి తీస్తే మంచి ఫలితం ఉంటుంది.

follow these tips to remove mehendi stains వంట సోడా వలన కూడా మంచి ఫలితం ఉంటుంది. దీనిలో మంచి లక్షణాలు ఉంటాయి. వంటసోడాలో నిమ్మరసం కలిపి మెహందీపై రాసి ఆరిన తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా రాయడం వల్ల ఆ మరకలు పోయే అవకాశాలు ఉంటాయి. ​నిమ్మలో బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ఏ మరకలు అయినా సరే నిమ్మతో పోతాయి. నిమ్మ చెక్కని తీసుకుని చేతులు, మెహందీ ఎక్కడ ఉందో ఆ చోట్ల రాసి బాగా రుద్దాలి. ఆ తర్వాత వేడి నీటితో కడగాలి. మంచి ఫలితాలు ఉంటాయి.

​ఇలా చేసాక కచ్చితంగా ఈ చిట్కాలు వాడిన తర్వాత చేతులకు మాయిశ్చరైజ‌ర్‌ రాస్తే చేతులు పొడిబారకుండా ఉంటాయి. ఈ చిట్కాలు పాటించడం వల్ల చాలా వరకూ మెహందీ మరకలు పోయే అవకాశం ఉంటుంది.

Admin

Recent Posts