Kidneys Stones : నేడు మన దేశంలో అధిక శాతం మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యాధుల్లో కిడ్నీ స్టోన్లు కూడా ఒకటి. ఇవి చాలా మందిలో ఏర్పడుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా కిడ్నీ స్టోన్లు అందరిలోనూ వస్తున్నాయి. ఇందుకు కారణాలు కూడా అనేకం ఉంటున్నాయి. అయితే ఎలా వచ్చినా కిడ్నీ స్టోన్లు ఒకసారి ఏర్పడితే కనుక జాగ్రత్త వహించాల్సిందే. ఎందుకంటే ఏదైనా పద్ధతిలో వాటిని కరిగించుకున్నా అవి తిరిగి మళ్లీ వస్తాయి. కనుక వాటి విషయంలో జాగ్రత్త పడాల్సిందే. అయితే కింద చెప్పిన ఓ పవర్‌ఫుల్ టిప్‌ను పాటిస్తే దాంతో కిడ్నీ స్టోన్లు ఇక రమ్మన్నా రావు. అంత ఎఫెక్టివ్‌గా ఈ చిట్కా పనిచేస్తుంది. మరదేమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
వేసవి సీజన్ వచ్చేసింది. మనకు ఎక్కడ చూసినా పుచ్చకాయలు కనిపిస్తున్నాయి. వేడి వేడి వాతావరణంలో చల్లని పుచ్చకాయలను తింటూ జనాలు ఆస్వాదిస్తున్నారు. అయితే పుచ్చకాయలను తిన్నాక ఎవరైనా వాటిల్లో ఉండే గింజలను పారేస్తారు. కానీ అలా చేయరాదు. ఎందుకంటే కిడ్నీ స్టోన్లను కరిగించే శక్తి పుచ్చకాయ గింజలకు ఉంది మరి. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయ గింజలను సేకరించి వాటిని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని నీటిలో కలుపుకుని రోజుకి మూడుసార్లు చొప్పున కొన్నిరోజుల పాటు తాగితే మంచి ఫలితాన్ని పొంచవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. దీని వల్ల కిడ్నీ స్టోన్లు త్వరగా కరిగిపోతాయట. అంతేకాదు, ఇకపై ఆ స్టోన్లు మళ్లీ వచ్చే అవకాశం ఉండదని కూడా ఆయుర్వేదం చెబుతోంది. అలాగే పుచ్చకాయ లోపల అడుగున ఉండే తెల్లని పదార్థాన్ని శరీరంలో ఫంగస్ ఉన్న ప్రాంతంలో అప్లయ్ చేస్తే క్రమేపీ దాని బారినుంచి కూడా బయటపడవచ్చు. కనుక ఈ సారి పుచ్చకాయను తిన్నప్పుడు దాంట్లో ఉండే గింజలు, పుచ్చకాయలో ఉండే తెల్లని పదార్థాన్ని పారేయకండి. వాటితో పైన చెప్పిన విధంగా ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.