Over Weight : ఊబకాయం, అధిక బరువు, పొట్ట, తొడల చుట్టూ కొవ్వు పేరుకపోవడం.. పదం ఏదైనా ఇవి అన్నీ కూడా శరీరంలో కొవ్వు అధికంగా పేరుకపోవడం వల్ల తలెత్తే సమస్యలు. ఈ సమస్యల బారిన పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. నిద్రలేమి, మానసిక ఒత్తిడి, మారిన జీవన విధానం, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం వంటి వాటిని అధిక బరువు బారిన పడడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. జన్యుపరంగా కూడా మనకు ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. ఈ అధిక బరువు సమస్యను దాల్చిన చెక్క టీ ని తాగడం వల్ల నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
దాల్చిన చెక్క.. ఇది మనందరికీ తెలిసిందే. వంటల్లో మసాలా దినుసుగా దీనిని ఉపయోగిస్తూ ఉంటాం. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దాల్చిన చెక్క టీ ని రోజుకు రెండు పూటలా తాగడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గవచ్చు. ఈ టీ ని తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. ఒక గిన్నెలో ఒక లీటర్ నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క పొడిని వేసి బాగా మరిగించాలి. తరువాత దీనిని వడకట్టి ఒక కప్పులోకి తీసుకోవాలి. తరువాత అందులో రుచికి తగినంత తేనెను కలిపి తాగాలి. మిగిలిన నీటిని ఫ్రిజ్ లో నిల్వ చేసుకుని మరుసటి రోజు కూడా తాగవచ్చు.
దాల్చిన చెక్క టీ ని ఉదయం పరగడుపున అలాగే రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి చాలా త్వరగా బరువు తగ్గుతారు. అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారు ఇంట్లోనే ఒక డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఈ డ్రింక్ ను ఇంట్లో ఉండే సహజ సిద్ద పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం మనం కరివేపాకును, జీలకర్రను, పసుపును, మిరియాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ డ్రింక్ ను తయారు చేసుకోవడానికి గాను ముందుగా ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి.
తరువాత అందులో పసుపు, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర వేసి బాగా మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న డ్రింక్ ను వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకుని తాగాలి. ఈ డ్రింక్ ను క్రమం తప్పకుండా రోజూ తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి నాజుకుగా తయారవుతారు. అదే విధంగా అధిక బరువుతో బాధపడే వారు మందార టీ నితాగడం వల్ల కూడా త్వరగా బరువు తగ్గవచ్చు. మందార పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పువ్వులతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల బరువు తగ్గడంతోపాటు శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఈ టీ ని తయారు చేసుకోవడానికి గాను 5 ఎండిన మందార పువ్వులను, రెండు గ్లాసుల నీటిని, తేనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. తరువాత అందులో ఎండిన మందార పువ్వులను వేసి మరో 5 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ టీ ని వడకట్టుకుని ఒక కప్పులోకి తీసుకోవాలి. తరువాత అందులో తగినంత తేనెను కలిపి తీసుకోవాలి. ఈ టీ ని ప్రతిరోజూ రెండు నుండి మూడు సార్లు తాగడం వల్ల శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కరిగి త్వరగా బరువు తగ్గుతారు.
అలాగే కొందరిలో నడుము చుట్టూ, తొడల దగ్గర, పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. ఈ సమస్యతో బాధపడే వారికి అల్లం నీరు ఎంతగానో సహాయపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి అల్లం నీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గిన్నెలో మూడు గ్లాసుల నీటిని పోసివేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక శుభ్రపరిచి తరిగిన అల్లం ముక్కలను వేసి మరలా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక కప్పులోకి తీసుకుని రుచికి తగినంత తేనెను కలిపి తాగాలి. ఈ నీటిని రోజుకు రెండు లేదా మూడు సార్లు తాగడం వల్ల వివిధ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరగడంతోపాటు బరువు కూడా తగ్గుతారు. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా త్వరగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.