Shiny Hair : బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్లాల్సిన ప‌నిలేదు.. ఇంట్లోనే మీ జుట్టును ఇలా స్మూత్‌గా మార్చుకోవ‌చ్చు..!

Shiny Hair : జుట్టు అందంగా, ప‌ట్టుకుచ్చులా మెర‌వాల‌ని, మృదువ‌గా ఉండాల‌ని ప్ర‌తి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం అనేక ర‌కాల షాంపుల‌ను వాడుతూ ఉంటారు. అలాగే పార్ల‌ర్ కి వెళ్లి జుట్టుకు సంబంధించిన వివిధ ర‌కాల ట్రీట్ మెంట్ ల‌ను తీసుకుంటారు. హెయిర్ స్టైల్స్ ను ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. ఎంతో డ‌బ్బు ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. అయితే ఇలా పార్ల‌ర్ వెళ్లే ప‌ని లేకుండా డ‌బ్బు ఖర్చు చేసే ప‌ని లేకుండా ఇంట్లోనే జుట్టును అందంగా, మృదువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇప్పుడు చెప్పే చిట్కాను వాడ‌డం వ‌ల్ల సెలూన్ లాంటి హెయిర్ లుక్ ను ఇంట్లోనే పొంద‌వ‌చ్చు. అలాగే ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల జుట్టు అందంగా మార‌డంతో పాటు జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.

జుట్టును మృదువుగా, కాంతివంతంగా మార్చే చిట్కా ఏమిటి.. దీనిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అలాగే దీనిని ఎలా వాడాలి.. అన్న త‌దిత‌ర విషయాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఒక అర‌టిపండును, ఒక కోడిగుడ్డును, అర చెక్క నిమ్మ‌ర‌సాన్ని, రెండు టీ స్పూన్ల కొబ్బ‌రి నూనెను, ఒక విట‌మిన్ ఇ క్యాప్సుల్ ను వాడాల్సి ఉంటుంది. ముందుగా ఒక జార్ లో అర‌టిపండు గుజ్జు, కోడిగుడ్డు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో నిమ్మ‌ర‌సం, కొబ‌రినూనె, విట‌మిన్ ఇ క్యాప్సుల్ వేసి 10 నిమిషాల పాటు అంతా క‌లిసేలా బాగా క‌ల‌పాలి.

follow these remedies for Shiny Hair
Shiny Hair

ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివ‌రి వ‌ర‌కు బాగా ప‌ట్టించాలి. త‌రువాత ప‌ది నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేసుకోవాలి. దీనిని ఆరే వ‌ర‌కు అలాగే ఉంచి ఆ త‌రువాత షాంపు మ‌రియు కండీషన‌ర్ ను వాడి త‌ల‌స్నానం చేయాలి. జుట్టు ఆరిన త‌రువాత సీర‌మ్ ను రాసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల చ‌క్క‌టి మృదువైన‌, ప‌ట్టుకుచ్చులాంటి జుట్టును చాలా సుల‌భంగా పొంద‌వ‌చ్చు. ఈ చిట్కాను వాడిన రెండువారాల్లోనే జుట్టులో వ‌చ్చిన మార్పును చూడ‌వ‌చ్చు.

D

Recent Posts