High BP : బీపీని కంట్రోల్ లో ఉంచాలంటే.. ఇలా చేయాలి..!

High BP : ప్ర‌స్తుత త‌రుణంలో స‌హ‌జంగానే చాలా మంది హైబీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ బీపీ బారిన ప‌డితే జీవితాంతం మందుల‌ను వాడాల్సి ఉంటుంది. బీపీని ఎప్ప‌టిక‌ప్పుడు కంట్రోల్‌లో ఉంచుకోవాలి. లేదంటే గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక బీపీ స‌మ‌స్య‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌డం ముఖ్యం. అయితే ఈ చిట్కాల‌ను పాటిస్తే బీపీ ఇట్టే కంట్రోల్ అవుతుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం లేవగానే గ్లాస్ లో గోరు వెచ్చని నీటిని తీసుకొని దాంట్లో సగం కోసిన నిమ్మకాయ రసాన్ని పిండుకొని తాగేయలి. అలా ప్రతి రోజూ పరగడుపునే తాగితే బీపీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. మీకు పుచ్చకాయ విత్తనాలు తెలుసు కదా. వాటిని గసగసాల‌ను తీసుకొని రెండింటినీ పొడిలా చేసుకొని ఉదయం ఓసారి రాత్రి ఓసారి రెండు పూటలు రోజూ ఓ చెంచాడు తింటే బీపీని బ్యాలెన్స్ చేసుకోవచ్చు.

follow these remedies to control High BP
High BP

ఇక వెల్లుల్లి కూడా బీపీని కంట్రోల్ చేసేందుకు చ‌క్క‌గా ప‌నికొస్తుంది. అందుకు గాను ఓ రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని చేతితో చిదిమి అలాగే తినేయాలి. అవి ఘాటుగా ఉన్నాయ‌ని భావించేవారు కాస్త తేనెతో తీసుకోవ‌చ్చు. ఇలా రోజూ తీసుకుంటే క‌చ్చితంగా బీపీని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల బీపీ సుల‌భంగా కంట్రోల్ అవుతుంది. దీంతో గుండె జ‌బ్బులు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Editor

Recent Posts