బరువు తగ్గడానికి చిట్కాలు.. బరువు తగ్గడం ఎలాగో తెలుసుకోండి..!

ప్రస్తుత తరుణంలో ఊబకాయం లేదా స్థూలకాయం లేదా అధిక బరువు సమస్య అనేది చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగానే చాలా మంది అధికంగా బరువు పెరుగుతున్నారు. అధికంగా బరువు ఉండడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నవారవుతారు. అందువల్ల బరువును తగ్గించుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన చిట్కాలు పనిచేస్తాయి. అవేమిటంటే..

follow these simple tips to reduce over weight

సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం.. యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌లో ఎసిటిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది మెటబాలిజంను పెంచుతుంది. దీని వల్ల క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. రోజూ రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో  ఒక టీస్పూన్‌ యాపిల్‌ సైడర్ వెనిగర్‌ను కలిపి తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు.

రోజూ తగినంత నీటిని తాగడం వల్ల కూడా అధిక బరువు తగ్గుతారు. నీటిని తగిన మోతాదులో తాగితే మెటబాలిజం మెరుగు పడుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు.

తులసి, వాము అధిక బరువును తగ్గించడంలో సహాయ పడతాయి. ఒక గ్లాస్‌ నీటిలో ఒక టీస్పూన్‌ వాము గింజలను వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఆ నీటిలో తులసి ఆకులు 4-5 వేసి మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి తాగేయాలి. రోజూ ఇలా పరగడుపునే ఈ నీటిని తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు.

అధిక బరువు తగ్గేందుకు బ్లాక్‌ కాఫీ కూడా సహాయ పడుతుంది. బ్లాక్‌ కాఫీలో అధిక బరువును తగ్గించే లక్షణాలు ఉంటాయి. అందువల్ల రోజూ దీన్ని ఒక కప్పు మోతాదులో తాగాలి. దీంతో పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది.

గ్రీన్‌ టీని రోజూ రెండు లేదా మూడు కప్పుల మోతాదులో తాగుతుండాలి. దీంతో బరువు తగ్గుతారు. గ్రీన్‌ టీని తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. కనుక గ్రీన్‌ టీని రోజూ తాగాలి.

Admin

Recent Posts