లాంగ్ కోవిడ్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!

కరోనా సోకిన తర్వాత బాధితులు ఒక సంవత్సరం పాటు అనేక ఆరోగ్య సంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నారు.  శ్వాస ఆడకపోవడం, అలసట, నిద్రలేమి, జ్వరం, పెరిగిన హృదయ స్పందన, ఊపిరితిత్తుల వైఫల్యం, జీర్ణ సమస్యలు ఉంటున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన దానికంటే ఎక్కువ సమయం పడుతోంది. కరోనా నుంచి కోలుకుని చాలా నెలలు గడిచినప్పటికీ పూర్తిగా కోలుకోలేని వ్యక్తులు లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ బాధితులుగా మారుతున్నారని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వ్యక్తులు వారి ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

long covid syndrome patients must take care of these precautions

యూఎస్, యునైటెడ్ కింగ్‌డమ్‌ లలోని NICE (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్) నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం.. లక్షణాలు నాలుగు నుండి 12 వారాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం కొనసాగుతున్నాయని, దీనిని లాంగ్ కోవిడ్ అంటారని అపోలో హాస్పిటల్స్ డిప్లెమెంట్ ఆఫ్ ప్లెమోనాలజీ ఎంఎస్ కన్వర్ చెప్పారు.

ఈ వ్యాధిలో రక్తం గడ్డకట్టే సమస్య కూడా కనిపిస్తుంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా దీర్ఘకాలిక శ్వాస సమస్యలు సంభవించవచ్చు. మితమైన, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు ఉన్న రోగుల చికిత్సలో అనేక రకాల ఔషధాలను ఉపయోగిస్తారు. అలాంటి రోగులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. వారు తమ శరీరంలోని చక్కెర స్థాయిలని, రక్తపోటును ప్రతిరోజూ తనిఖీ చేసుకోవాలి. ఆహారం, పానీయాల గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ ఉన్న మహిళలు పురుషుల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా అలసటను అనుభవిస్తున్నారు. అయితే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు పురుషులలో ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా ప్రజలు జీర్ణ, మూత్రపిండాలు, కళ్ళలో బలహీనత సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. సంక్రమణ నివేదిక ప్రతికూలంగా వచ్చిన తర్వాత ప్రజలు ఒక సంవత్సరం పాటు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

కోరోనా నుండి కోలుకున్న వ్యక్తులు ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇవి దెబ్బతిన్న కణాలను భర్తీ చేయడానికి, రిపేర్ చేయడానికి సహాయపడతాయా. ఇది కాకుండా ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయాలి. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులు శ్వాస వ్యాయామాలు చేయాలి. కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి.

Admin

Recent Posts