చిట్కాలు

Malabaddakam : మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌కు ఇంటి చిట్కాలు.. వీటిని పాటించండి చాలు..!

Malabaddakam : చాలామంది, ఈ మధ్యకాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువమంది మలబద్ధకంతో కూడా బాధపడుతున్నారు. మలబద్ధకం సమస్య నుండి బయటపడడానికి, చాలామంది రకరకాల పద్ధతుల్ని పాటిస్తున్నారు. ఈ సమస్య నుండి బయటపడడానికి. ఇలా చేయడం మంచిది. మందులు వేసుకోక్కర్లేదు. సహజ పద్ధతుల ద్వారా మలబద్ధకం నుండి ఉపశమనాన్ని మనం పొందవచ్చు. పెరుగు కడుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థ ని ఇది మెరుగుపరుస్తుంది. అవిసె గింజలని పెరుగులో కలిపి తీసుకుంటే, ఎంతో మంచి జరుగుతుంది.

అవిసె గింజల్ని పెరుగులో కలిపి తీసుకుంటే, మలం మృదువుగా మారి ఈజీగా బయటికి వచ్చేస్తుంది. అలానే, ఉసిరి రసం కూడా మలబద్ధకం నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. 30 గ్రాముల ఉసిరి రసాన్ని నీటిలో కలిపి ఉదయం పరగడుపున తాగాలి. ఇలా దీనిని మీరు తాగడం వలన త్వరగా ఉపశమనం కలుగుతుంది. నెయ్యి, పాలు కూడా బాగా హెల్ప్ చేస్తాయి. బాగా జీర్ణం అవుతుంది.

follow these tips for malabaddakam

మలాన్ని బయటకి తరలించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మలబద్ధకం నుండి వెంటనే ఉపశమనం ని అందిస్తుంది. ఒక కప్పు వేడి పాలు లో చెంచా నెయ్యి, పాలు కలిపి తీసుకుంటే మంచిది. మలబద్ధకం సమస్యతో బాధపడే వాళ్ళు, ఫుల్లుగా నీళ్లు తాగితే కూడా మంచిది. నీళ్లు బాగా తాగితే మలబద్ధకం నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. నీళ్లు ఎక్కువ తీసుకోకపోతే ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి.

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూడా తీసుకుంటూ ఉండండి. బ్రోకలీ, బచ్చలి కూర, మొలకలు వంటి వాటిని కూడా తీసుకోండి. ఇవి కూడా మలబద్ధకం సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. అయితే, చాలామంది మలబద్ధకం సమస్య వలన అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకోసం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని కూడా వాడుతుంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలతో, ఈజీగా ఈ సమస్య నుండి బయట పడొచ్చు.

Admin

Recent Posts