Swelling : మనం ఏదైనా వ్యాధి బారిన పడబోయే ముందు మన శరీరం పలు సూచలనలను చేస్తుంది. పలు లక్షణాలను బయటకు చూపిస్తుంది. శరీరంలో అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు శరీరం చూపించే లక్షణాల్లో వాపులు కూడా ఒకటి. ముఖం, కాళ్లు, చేతులు.. ఇలా ఇతర శరీర భాగాలు కూడా వాపులకు లోనై కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. శరీరంలో సోడియం ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. నీళ్లు తక్కువగా తాగితే శరీరంలో ఉన్న సోడియం బయటకు పోకుండా పేరుకుపోయి కిడ్నీల్లో చేరుతుంది. ఫలితంగా శరీరం మొత్తం వాపులకు గురై కనిపిస్తుంది.
కొన్నిసార్లు ఒకే భంగిమలో ఎక్కువ సేపు కూర్చునే వాళ్లకు కూడా కాళ్లల్లో వాపులు వస్తుంటాయి. అయితే శరీరంలో ఏర్పడే ఈ వాపులను మనం ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా నయం చేసుకోవచ్చు. మన వంటింట్లో ఉండే జీలకర్ర, పంచదారను ఉపయోగించి మనం మన శరీరంలో ఏర్పడే వాపులను నయం చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక జార్ లో 5 టీ స్పూన్ల జీలకర్రను, 5 టీ స్పూన్ల పంచదారను తీసుకోవాలి. తరువాత వీటిని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని రోజుకు మూడు పూటలా ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో వచ్చే వాపులు వాటంతట అవే తగ్గిపోతాయి.
గర్భిణీల్లో కూడా ఈ వాపులు రావడం సహజం. అలాంటప్పుడు వారు కూడా ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా ఇలా వాపులతో బాధపడుతున్నప్పుడు వేడి నీటితో కాపడం పెట్టుకోవడం వల్ల కూడా సత్వర ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కాలను పాటించడంతోపాటు సోడియం ఉన్న ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. అలాగే పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఈ చిట్కాలను పాటిస్తూ సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల వాపులు, నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.