Warts : మనలో చాలా మంది చర్మంపై పులిపిర్లను కలిగి ఉంటారు. కొన్ని ప్రాంతాల వారు వీటిని సూర్యుని కాయలు అని కూడా అంటారు. ఎక్కువగా పులిపిర్లు.. ముఖం, చేతులు, మెడ భాగాలలో ఉంటాయి. కొందరికి పులిపిర్లు ఎక్కువ నల్లగా ఉండడాన్ని కూడా మనం చూడవచ్చు. కొందరు పులిపిర్లను కట్ చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పటికి కూడా పులిపిర్లు మళ్ళీ వస్తూ ఉంటాయి. మనలో ఈ పులిపిర్లు వైరస్ ఇన్ ఫెక్షన్ కారణంగా వస్తాయి. హెచ్ పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) అనే వైరస్ కారణంగా పులిపిర్లు వస్తాయి. ఈ వైరస్ లు మన శరీరం మీద దాడి చేసినప్పుడు మన శరీరంలో ఉండే రక్షణ వ్యవస్థ కొన్ని సార్లు వాటిని నశింపజేయని కారణంగా దాడి చేసిన ప్రాంతంలో వైరస్ లు అభివృద్ధి చెంది పులిపిర్లుగా బయటకు వస్తాయి.
ఈ వైరస్ లు ప్రాణాంతకం కాదు. కొందరిలో పులిపిర్లు నొప్పిని కూడా కలిగి ఉంటాయి. పులిపిర్ల వల్ల ఎలాంటి హాని కలగదు. పులిపిర్లు అంటు వ్యాధిలా ఒకరి నుండి ఒకరికి వ్యాపించవు. అయినప్పటికీ ఇవి చూడడానికి అందవిహీనంగా ఉంటాయి. సహజసిద్దంగా వీటిని మనం తొలగించుకోవచ్చు.
ఉడికించిన ఆహారాన్ని తీసుకోకుండా మూడు పూటలా కేవలం పచ్చి ఆహారాన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి పులిపిర్లు వాటంతట అవే రాలిపోతాయి. పచ్చి ఆహారాన్ని అందరూ తిన లేరు. హోమియోపతి మందుల ద్వారా కూడా మనం పులిపిర్లను తగ్గించుకోవచ్చు. ఇలా పులిపిర్లు తగ్గిన తరువాత కనీసం 70 శాతం పచ్చి ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా పులిపిర్లు రాకుండా ఉంటాయి. హోమియోపతి మందుల ద్వారా లేదా కేవలం పచ్చి ఆహారాన్ని తీసుకోవడం వల్ల పులిపిర్లు తొలగిపోయి శాశ్వతంగా రాకుండా ఉంటాయి.