చిట్కాలు

Curd Face Pack : బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్ల‌కుండానే అలాంటి అందాన్ని ఇలా సింపుల్‌గా పొందండి..!

Curd Face Pack : అందంగా ఉండాలని, అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు. అందమైన చర్మాన్ని మీరు కూడా సొంతం చేసుకోవాలంటే, బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరగక్కర్లేదు. ఇంట్లోనే ఈ విధంగా ఫేషియల్ చేసుకుంటే ఎంతో అందంగా కనపడతారు. కాంతివంతంగా మీ చర్మం మారుతుంది. చాలామంది అందంగా ఉండాలని, అందంగా కనపడేందుకు బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఫేషియల్స్ ని చేయించుకుంటూ ఉంటారు. కానీ సులభంగా ఇంట్లోనే ఈ ఇంటి చిట్కాలతో అందంగా మారిపోవచ్చు.

బ్యూటీ పార్లర్ లో ఫేషియల్స్ వంటివి చేయించుకోవడం వలన డబ్బు వృథా అవుతుంది. పైగా అనేక రకాల కెమికల్స్ ఉంటాయి. వాటి వలన ప్రయోజనాల‌ కంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఇంట్లో ఈ విధంగా పాటించడం మంచిది. ముందు మీరు మూడు చెంచాల పెరుగు తీసుకుని, అందులో నీటిని మొత్తం ఒక క్లాత్ తో తీసేయాలి. నీరు తీసేసిన తర్వాత దానిలో విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోవాలి. లేకపోతే మీరు కొబ్బరి నూనె కానీ బాదం నూనెను కానీ వేసుకోవచ్చు.

get beauty parlor like beaty at home with curd

తర్వాత ఒక చెంచా గ్లిజరిన్ ని కూడా వేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసి రాత్రి నిద్ర పోయే ముందు ముఖానికి పట్టించండి. పది నిమిషాల‌ పాటు మృదువుగా మసాజ్ చేసుకోండి. ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఇలా వారం రోజుల‌ పాటు అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్ పోతాయి. మొటిమల‌ బాధ కూడా ఉండదు.

మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యల నుండి కూడా బయటపడవచ్చు. మీ ముఖం చాలా అందంగా మారుతుంది. రోజూ మీరు దీనిని తయారు చేసుకోక్కర్లేదు. ఒకేసారి దీనిని తయారు చేసుకుని, ఫ్రిజ్‌లో పెట్టుకుని కావాల్సినప్పుడు మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసి ఈజీగా మీ స్కిన్ ని అందంగా మార్చుకోవచ్చు.

Admin

Recent Posts