Back Pain : ఈ రోజుల్లో మనలో చాలా మంది మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. యుక్త వయసులో ఉన్న వారు కూడా ఈ నొప్పుల కారణంగా చేస్తున్న పనిలో ఉత్సాహం చూపించలేకపోతున్నారు. మారిన జీవన విధానం, పోషకాలు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, ఇన్ స్టాంట్ గా దొరికే ఆహారాలను తీసుకోవడానికి మొగ్గు చూపడం వంటి అనేక కారణాల వల్ల ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
అలాగే చిన్న చిన్న సమస్యలకి కూడా మందులను తీసుకోవడం ప్రస్తుత కాలంలో ఎక్కువైపోయింది. ఈ మందుల వల్ల దుష్ప్రభావాలు అధికమై కీళ్లు పటుత్వాన్ని కోల్పోయి కీళ్ల నొప్పులు వస్తున్నాయి. ఈ కీళ్ల నొప్పులను మందుల ద్వారా మాత్రమే కాకుండా సహజ సిద్దంగా కూడా మనం తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ నొప్పుల బారిన పడిన వారు ఎంతగా ఇబ్బంది పడుతుంటారో మనం చూస్తూనే ఉంటాం. కీళ్ల నొప్పులను తగ్గించడంలో మేక పాలు ఎంతో సహాయపడతాయని వారు అంటున్నారు.
మేక పాలల్లో నువ్వులు, బెల్లం కలిపి రోజుకు రెండుపూటలా తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు, ఇతర కీళ్ల నొప్పులు తగ్గడమే కాకుండా భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మేక పాలతో తయారు చేసుకున్న ఈ మిశ్రమం నొప్పులను శాశ్వతంగా దూరం చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒక గ్లాస్ గోరు వెచ్చని మేకపాలల్లో ఒక చిన్న బెల్లం ముక్క, ఒక టీ స్పూన్ నువ్వుల పొడిని కలుపుకుని క్రమం తప్పకుండా నెలరోజుల పాటు తీసుకోవడం వల్ల ఎలాంటి కీళ్ల నొప్పులైన మటుమాయం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
మేక పాలల్లో క్యాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. మేక పాలను తాగడం వల్ల ఈ పోషకాలన్నీ కూడా మన శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. మేక పాలల్లో ఉండే ఈ పోషకాలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. అదే విధంగా నువ్వులు కూడా మన శరీరానికి మేలు చేసేవే. వీటిలో కూడా క్యాల్షియం అధికంగా ఉంటుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో నువ్వులు కూడా మనకు ఎంతగానో దోహదపడతాయి.
కనుక కీళ్ల నొప్పులతో బాధపడే వారు పైన తెలిపిన విధంగా మేక పాలల్లో బెల్లం, నువ్వుల పొడి కలిపి తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పితో పాటు ఇతర కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా ఈ కీళ్ల నొప్పుల సమస్య భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుంది.