Guraka : గురక.. చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో ఇది ఒకటి. గురక కారణంగా గురక పెట్టే వ్యక్తితో పాటు ఆ గదిలో పడుకునే ఇతర వ్యక్తులు కూడా నిద్రలేమికి గురి అవుతూ ఉంటారు. అంగిలి, నాలుక మరియు గొంతు యొక్క కారణాలు వదులవ్వడం వల్ల గురక వస్తుంది. గొంతు భాగంలో కణజాలం ఎంతగా వదులవుతుంది అంటే అది గాలి మార్గానికి అడ్డు వచ్చి గాలికి అదురుతూ ఉంటుంది. గాలి మార్గం సన్నగా ఉంటే ఆ అదురు మరింత ఎక్కువగా ఉండి గురక పెద్దగా ఉంటుంది. గురక అసౌకర్యం మాత్రమే కాదు 75 శాతం మంది నిద్రలేమి సమస్యకు కూడా గురి అవుతున్నారని పరిశోధనల్లో తేలింది. గురక హృద్రోగానికి కూడా దారి తీసే అవకాశం ఉంది. మార్కెట్ లో గురకను తగ్గించే పరికరాలు ఉన్నా వాటి శాస్త్రీయత ఇంకా నిరూపితం కాలేదు.
కణజాలం వదులుగా అవ్వడం, మద్యపానం, పొగ తాగడం, అలర్జీలు, శ్వాసకోస సంబంధిత సమస్యల వంటి వాటి వల్ల గురక రావచ్చు. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఇంటి చిట్కాలను ఉపయోగించి గురక నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. గురకను తగ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తేమ.. తేమ లేని గదుల్లో పడుకోవడం కూడా గురక రావడానికి కారణం అవుతుంది. ఎందుకంటే పొడిగాలి ముక్కులో ఉండే పొరలను పొడిగా మార్చి గురకకు కారణం అవుతుంది. తేమను పెంచే పరికరం హ్యూమిడిటీ ఫైయర్ ను గదిలో ఉంచుకోవడం వల్ల గురక తగ్గుతుంది. అలాగే అధిక బరువు కూడా గురకకు కారణం అవుతుంది. అధిక బరువుతో ఉన్నప్పుడు గొంతులో మరిన్ని కణజాలాలు ఉండి గురకకు కారణం కావచ్చు.
ఎంత పెద్దగా అవరోధం ఉంటే అంతగా గాలి ప్రయాణం ఆపబడుతుంది. ఇది అదురుకు కారణం అయ్యి గురకకు దారి తీస్తుంది. కనుక వీలైనంత త్వరగా బరువు తగ్గాలి. గురకతో బాధపడే వారు వారు పడుకునే మంచం కింద తల వైపు రాయిని లేదా చెక్కను ఉంచి తల భాగం పైకి ఉండేలా చూసుకోవాలి. గురకను తగ్గించే పద్దతుల్లో ఇది ఒకటి. అదేవిధంగా ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రం చేసుకోవాలి. అలర్జీని కలిగించే పుప్పొడి, జంతువుల వెంట్రుకలు, దుమ్ము మొదలైనవి గొంతులో అడ్డం సృష్టించి గాలిని అడ్డగిస్తాయి. ఇవి గురకకు దారి తీయవచ్చు. ఇంట్లో ఉండే ఎయిర్ ఫిల్టర్ ను తరచూ మారుస్తూ ఉండాలి. అలాగే గురక ఎందుకు వస్తుందో ముందుగా తెలుసుకోవాలి. గురక ఎందుకు వస్తుందో తెలుసుకుంటే దానికి పరిష్కారం కనుగొనడం సులభం అవుతుంది. గురక పెడుతున్నప్పుడు నోరు మూసి గురక పెడితే నాలుకలో సమస్య ఉన్నట్టు, నోరు తెరిసి మూడపెడితే గొంతులో సమస్య ఉన్నట్టు గుర్తించాలి. కొన్ని రకాల ఆయుర్వేద మందులను ఉపయోగించి కూడా గురకను తగ్గించుకోవచ్చు.
వీటిలో ఉండే ఔషధ గుణాలు ముక్కు దిబ్బడను తగ్గిస్తాయి. ఇది గురకను ఆపుతుంది. గురకతో బాధపడే వారు వేపరైజర్ కు పెప్పరమెంట్ వంటి తైలాలను జత చేయాలి. ఇవి గాలి వెళ్లే మార్గాలను సులభం చేసి సైనస్ ప్రాంతాలను ఖాళీ చేసి సుఖంగా నిద్రపోయేలా చేస్తుంది. అలాగే పడుకునేటప్పుడు దిండ్లను సరిగ్గా అమర్చుకుని పడుకోవాలి. పడుకునేటప్పుడు తల పైకి ఉండేలా చూసుకుని పడుకోవాలి. ఇలా చేయడం వల్ల శ్వాస మార్గాలు తెరుచుకుని శ్వాస సులభం అవుతుంది. దీంతో గురక రాకుండా ఉంటుంది. దిండు మరీ వత్తుగా కానీ, గట్టిగా కానీ వాడుకోకూడదు. గురకతో ఇబ్బంది పడే వారు ప్రాణాయామం నేర్చుకోవాలి. ఇవి శ్వాసను అదుపు చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ప్రాణాయామం పలు రకాల నిద్రలేమి సమస్యలను కూడా తగ్గిస్తుంది. నాలుక, గొంతుకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. నాలుక, గొంతు కండరాలు బాగుంటే గురక రాకుండా ఉంటుంది. కండరాలు వదులైనప్పుడే మనం ఎక్కువ గురక పెడతాం.
నాలుక, గొంతు కండరాలు గట్టిగా ఉంటే మనకు గురక రాకుండా ఉంటుంది. అలాగే మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. పడుకోవడానికి ముందు కనీసం రెండు గంటల వరకు ఎటువంటి మత్తు పదార్థాలను, మద్యాన్ని తీసుకోకూడదు. ఇది గొంతులో గాలి మార్గాన్ని వదులు చేసి శ్వాసకు అడ్డంకం కలిగిస్తాయి. గురక పెట్టే వారు వెల్లకిలే పడుకోకుండా ఏదో ఒకవైపు తిరిగి పడుకోవాలి. అలాగే పడుకునే ముందు నీటిలో యాలకుల పొడిని కలుపుకుని తాగినా కూడా గురక నుండి ఉపశమనం కలుగుతుంది. తేనెలో, ఆలివ్ నూనెను కలిపి పడుకునే ముందు తీసుకున్నా కూడా గురక తగ్గుతుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల గురక సమస్య నుండి మనం సత్వర ఉపశమనాన్ని పొందవచ్చు.