Hair Growth Pack : ఊడిన చోటే వెంట్రుక‌లు మ‌ళ్లీ రావాలంటే.. జుట్టు ఒత్తుగా పెర‌గాలంటే.. ఇలా చేయండి..!

Hair Growth Pack : జుట్టు అందంగా, పొడ‌వుగా పెర‌గాల‌ని మ‌న‌లో చాలా మంది కోరుకుంటారు. జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది జుట్టు రాలడం అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌బుతున్నారు. జుట్టు రాల‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, ఆందోళ‌న, ర‌సాయ‌నాలు ఎక్కువ‌గా ఉండే షాంపుల‌ను వాడ‌డం, చుండ్రు, ఇత‌ర‌త్రా అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మార్కెట్ లో దొరికే అన్ని ర‌కాల షాంపుల‌ను, నూనెల‌ను వాడుతూ ఉంటారు.

ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికి ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌క ఒబ్బంది ప‌డుతున్న వారు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. ఒక చిన్న ఇంటి చిట్కాను ఉప‌యోగించి మ‌నం జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు త్వ‌ర‌గా వ‌చ్చేలా చేయ‌వ‌చ్చు. జుట్టు రాల‌డాన్ని జుట్టును ఒత్తుగా మార్చే ఇంటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించే ఈ అద్భుత‌మైన చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఉల్లిపాయ‌ను, క‌ల‌బంద గుజ్జును, కొబ్బ‌రి నూనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా పెద్ద ఉల్లిపాయ‌ను తీసుకుని ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత దానిని జార్ లో వేసి మెత్త‌గా పేస్ట్ గా చేసుకోవాలి. త‌రువాత దీనిని వ‌స్త్రంలో లేదా జ‌ల్లిగంటెలో వేసి ర‌సాన్ని తీసుకోవాలి. ఈ ఉల్లిపాయ ర‌సాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దానికి స‌మానంగా క‌ల‌బంద గుజ్జును వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ రెండింటికి స‌మానంగా కొబ్బ‌రి నూనెను వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని జుట్టు మొత్తానికి చ‌క్క‌గా ప‌ట్టించాలి.

Hair Growth Pack use this for healthy hair
Hair Growth Pack

త‌రువాత ఈ నూనె కుదుళ్ల‌ల్లోకి ఇంకేలా బాగా మ‌ర్దనా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని గంట పాటు అలాగే జుట్టుకు ఉంచుకుని త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడుసార్లు ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అలాగే రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు చాలా త్వ‌ర‌గా వ‌స్తుంది. ఈ చిట్కాను వాడ‌డం వల్ల జుట్టు కుదుళ్ల‌కు కావాల్సిన పోష‌కాలు చ‌క్క‌గా అంది జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. అంతేకాకుండా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల జుట్టు నల్ల‌గా కాంతివంతంగా త‌యార‌వుతుంది. మార్కెట్ లో దొరికే షాంపుల‌ను, నూనెల‌ను వాడ‌డానికి బ‌దులుగా ఇలా ఇంట్లోనే ఈ చిట్కాను ఉప‌యోగించి మ‌నం చాలా సుల‌భంగా జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు.

Share
D

Recent Posts