Hair Growth Remedy : మనం జుట్టును అందంగా, ఆకర్షణీయంగా, శుభ్రంగా ఉంచుకోవడానికి గానూ మనం షాంపును ఉపయోగిస్తూఉంటాం. ప్రస్తుత కాలంలో అందరూ జుట్టును ఉపయోగించుకోవడానికి ఈ షాంపులనే ఉపయోగిస్తున్నారు. దానికి అనుగుణంగానే మనకు మార్కెట్ లో రకరకాల షాంపులు లభ్యమవుతున్నాయి. కానీ మనకు లభించే ఈ షాంపుల్లో అధికంగా రసాయనాలు వాడుతున్నారు. దీని కారణంగా జుట్టుకు ఎటువంటి మేలు జరగకపోగా ఈ రసాయనాల కారణంగా జుట్టు పాడవుతుంది. అయితే షాంపుతో మన జుట్టుకు ఎటువంటి హాని కలగకుండా అందంగా, ధృడంగా జుట్టును ఉంచుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. కొన్ని రకాల సహజ సిద్ద పదార్థాలను మనం వాడే షాంపులో కలపడం వల్ల జుట్టుకు ఎటువంటి హాని కలగదు.
అంతేకాకుండా జుట్టు రాలడం, జుట్టు తెగిపోవడం, జుట్టు చిట్లడం, చుండ్రు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. జుట్టును ఆకర్షణీయంగా, అందంగా మార్చే ఈ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో మన జుట్టుకు తగినంత మనం తరచూ ఉపయోగించే షాంపును తీసుకోవాలి. తరువాత దీనిలో అర టీ స్పూన్ టీ పౌడర్ ను వేసి కలపాలి. తరువాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయల పొడిని వేసి కలపాలి. ఇక చివరగా ఇందులో ఒక టీ స్పూన్ కలబంద గుజ్జును వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న షాంపుతో జుట్టంతటికి పట్టించి 2 నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. తరువాత దీనిని జుట్టుపై 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. 5 నిమిషాల తరువాత ఎప్పుడూ చేసినట్టే తలస్నానం చేయాలి. ఇలా తయారు చేసుకున్న షాంపును జుట్టుపై 10 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంచకూడదు.
ఇలా తయారు చేసుకున్న షాంపును ఉపయోగించిన తరువాత ఎటువంటి ఇతర షాంపును ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. తలస్నానం చేసిన ప్రతిసారి ఇలా షాంపును తయారు చేసుకుని వాడడం వల్ల మన జుట్టు మృదువుగా తయారవుతుంది. ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టు చిట్లడం, జుట్టు తెగడం, చుండ్రు వంటి ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా జుట్టుకు ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది.