Hand And Legs Pain : మన ఇంట్లో ఉండే పదార్థాలతో పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, కీళ్ల వాతం వల్ల వచ్చే అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి. ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల మనం అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా క్యాల్షియం లోపంతో బాధపడే వారు ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల క్యాల్షియం లోపంను కూడా నివారించుకోవచ్చు. పోషకాహార లోపం వల్ల తలెత్తే నీరసం, అలసట వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు కూడా తొలగిపోతాయి. వాత, కఫ దోషాలు కూడా తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మన శరీరానికి మేలు చేసే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలను తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ సోంపు గింజలను వేసి వేడి చేయాలి. సోంపు గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో అలాగే శరీరంలో జీవక్రియల రేటును పెంచడంలో సోంపు గింజలు మనకు ఎంతగానో దోహదపడుతాయి. నిద్రలేమిని సమస్యను తగ్గించడంలో, ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో, శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో ఇది ఎంతో సహాయపడతాయి.
కీళ్ల నొప్పులను తగ్గించడంలో, చర్మాన్ని అందంగా మార్చడంలో కూడా ఇవి మనకు ఉపయోగపడతాయి. సోంపు గింజలను తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇలా సోంపు గింజలను వేసిన తరువాత ఇందులో ఒక ఇంచు అల్లాన్ని ముక్కలుగా చేసి వేసుకోవాలి. అల్లం శరీరంలో రక్తప్రసరణను వేగవంతం చేస్తుంది. మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో, జీర్ణశక్తి మెరుగుపరచడంలో, తలనొప్పిని తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అల్లం మనకు ఎంతో దోహదపడుతుంది. తరువాత ఈ పాలల్లో చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేసి బాగా మరిగించాలి. దాల్చిన చెక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.
దాల్చిన చెక్కను వాడడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, రక్త ప్రసరణను వేగవంతం చేయడంలో దాల్చిన చెక్క మనకు ఎంతో దోహదపడుతుంది. ఇలా మరిగించిన పాలను వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇవి గోరు వెచ్చగా అయిన తరువాత వీటిలో తేనెను కానీ, పటిక బెల్లాన్ని కానీ కలుపుకుని తాగాలి. ఇలా తయారు చేసుకున్న పాలను ఉదయం పూట లేదా రాత్రి పడుకునే ముందు తాగాలి. ఈ విధంగా పాలను తయారు చేసుకుని తాగడం వల్ల మనం అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. ఈ పాలను తాగడం వల్ల కీళ్ల నొప్పులు, అలసట, బలహీనత వంటి అనేక అనారోగ్య సమస్యలు తగ్గి చక్కటి ఆరోగ్యం మన సొంతమవుతుంది.