చిట్కాలు

మోచేతులు, మోకాళ్లు, మెడ‌పై ఉండే న‌లుపుద‌నం త‌గ్గాలా..? ఇలా చేయండి..!

మోచేతి, మోకాలు భాగాలు నల్లగా ఉంటే చికాకు తెప్పిస్తాయి. శరీరమంతా ఒక రంగులో ఉంటే మోకాలు, మోచేతి భాగాలు మాత్రం నల్లగా ఉండడం చర్మ సమస్య అని చెప్పవచ్చు. సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల వల్ల ఈ ప్రదేశాలు నల్లగా మారుతుంటాయి. అంతేకాదు చనిపోయిన చర్మకణాలన్నీ ఒకదగ్గర చేరడం వల్ల కూడా చర్మం నల్లగా మారుతుంది. ఐతే ఈ సమస్య నుండి బయటపడి చర్మాన్ని తెలుపు రంగులోకి తీసుకురావచ్చు. నేచురల్ గా ఈ సమస్య నుండి ఎలా బయటపడగలమో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం రోజూ వాడే బంగాళదుంప ఈ సమస్యని దూరం చేస్తుంది. బంగాళదుంప రసాన్ని తీసుకుని నల్లగా ఉన్న ప్రదేశాలు మోకాలు, మోచేతి భాగాలకి అప్లై చేసి 20 నుండి 30నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ఒకవారం పాటు చేస్తే నల్లటి భాగాలు మాయమవుతాయి. సగం టీస్పూన్ ఉప్పు, చక్కెర కలిపి నిమ్మకాయలో నింపి దాన్ని తీసుకుని నల్లటి భాగాల మీద బాగా రుద్దాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. సిట్రిక్ యాసిడ్‌ చర్మకాంతిని మెరిసేలా చేస్తుంది.

here it is how you can get rid of darkness on elbows and knees

శనగపిండిలో రోజ్ వాటర్ కలుపుకుని పేస్ట్ లాగా తయారుచేయాలి. వాటికి కొంచెం నిమ్మరసం కలుపుకుని అన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలపాలి. ఆ తర్వాత ఆ పేస్టుని నల్లటి భాగాల మీద రుద్దుకుని అరగంట పాటు అలాగే ఉంచి, చల్లని నీటితో కడగాలి. అంతే వారం రోజుల్లో నల్లటి భాగాలన్ని మిగతా శరీర రంగులోకి వచ్చేస్తాయి.. బొప్పాయి, తేనె కలిపిన మిశ్రమాన్ని తీసుకుని నల్లని భాగాలైన మోకాలు, మోచేతికి అప్లే చేసుకోవాలి. 20నిమిషాల తర్వాత మామూలు నీటితో శుభ్రపర్చుకోవాలి. ఇలా వారం రోజుల పాటు చేయాలి.

Admin

Recent Posts