చిన్నారుల్లో వచ్చే దగ్గు, గొంతునొప్పి, జలుబు సమస్యలకు సహజసిద్ధమైన చిట్కాలు..!

సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే చాలా మందికి శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కనుక త్వరగా తగ్గవు. కానీ కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే చిన్నపిల్లల్లో వచ్చే దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యలను తగ్గించవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..

చిన్నారుల్లో వచ్చే దగ్గు, గొంతునొప్పి, జలుబు సమస్యలకు సహజసిద్ధమైన చిట్కాలు..!

1. అర టీస్పూన్‌ పసుపు, పావు టీస్పూన్‌ ఉప్పు కలిపి నోట్లో వేయాలి. తరువాత గోరు వెచ్చని నీళ్లను తాగించాలి. దీంతో దగ్గు, జలుబు తగ్గుతాయి.

2. పసుపు కొమ్ములు, గోధుమలను సమానంగా తీసుకుని వాటిని మట్టి మూకుడులో వేసి దోరగా వేయించాలి. మెత్తగా పొడి చేశాక 50 మిల్లీగ్రాముల పొడిని ఒక టీస్పూన్‌ తేనెతో ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. దీని వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.

3. చిన్నారులకు తలంటు స్నానం చేయించే ముందు చెవుల్లో రెండు చుక్కల చొప్పున నువ్వుల నూనె వేయాలి. దీని వల్ల శ్వాస కోశ సమస్యలు రాకుండా ఉంటాయి.

4. వాము టీస్పూన్‌, బెల్లం 4 టీస్పూన్లు కలిపి నూరి ఒక కప్పు నీళ్లలో వేసి మరిగించాలి. నాలుగో వంతు మిగిలే వరకు మరిగించి చల్లార్చాలి. తరువాత చిన్నారులకు ఆరు గంటలకు ఒకసారి ఆ మిశ్రమాన్ని ఇవ్వాలి. దీంతో జలుబు, గొంతు నొప్పి, దగ్గు తగ్గుతాయి.

5. పసుపు, పటికబెల్లం పొడి నిప్పులపై వేసి ఆ పొగను తలవైపు నుంచి వేయాలి. ఇలా చేస్తే ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుంది.

6. నిమ్మరసంలో కొద్దిగా తేనె, గోరు వెచ్చని నీళ్లను కలిపి కొద్ది కొద్దిగా ఇస్తుండాలి. దగ్గు, జలుబు, గొంతు నొప్పి తగ్గుతాయి.

7. వాము, ఉప్పు, పసుపు వేడిచేసి గుడ్డలో కట్టి గొంతుకు కాపడం పెడుతుండాలి. గొంతు నొప్పి, దగ్గు తగ్గుతాయి.

Admin

Recent Posts