గర్భిణీలకు సహజంగానే వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇది సహజమే. ప్రసవ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ లక్షణాలు వాటంతట అవే తగ్గిపోతాయి. అందుకు ఏమీ చేయాల్సిన పనిలేదు. అయితే కొందరికి ఆయా సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ఇందుకు పలు కారణాలు ఉంటాయి. కానీ కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. అల్లం మనందరి ఇళ్లలోనూ ఉంటుంది. ఇది వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. చిన్న అల్లం ముక్కను బుగ్గన పెట్టుకుని నములుతూ దాని నుంచి వచ్చే రసాన్ని మింగుతుండాలి. లేదా నీటిలో అల్లంను వేసి మరిగించి ఆ డికాషన్‌ను తాగుతుండాలి. ఇలా రోజుకు 3 సార్లు చేయాలి. లేదా భోజనానికి ముందు మూడు పూటలా 1 టీస్పూన్ అల్లం రసం తాగాలి. దీంతో వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం తగ్గుతాయి.
2. వికారం, వాంతికి వచ్చినట్లు అనిపించడం సమస్యలను తగ్గించడంలో నిమ్మరసం కూడా బాగానే పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల తాజాదనపు అనుభూతి కలుగుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి రెండు పూటలా తీసుకోవాలి. భోజనం చేశాక 30 నిమిషాలు ఆగి ఆ నీటిని తాగాలి. దీంతో ఆయా సమస్యలు తగ్గుతాయి.
3. వికారం సమస్యను తగ్గించడంలో పెప్పర్‌మింట్ ఆయిల్ కూడా బాగానే పనిచేస్తుంది. అధ్యయనాల ప్రకారం.. అరోమాథెరపీ వల్ల వికారం సమస్యను తగ్గించుకోవచ్చు. కొన్ని చుక్కల పెప్పర్ మింట్ ఆయిల్‌ను చేతిపై వేసి రుద్దాలి. తరువాత దాన్ని వాసన పీలుస్తుండాలి. దీంతో వికారం తగ్గుతుంది. వాంతులు కాకుండా ఉంటాయి.
4. సోంపు గింజల పొడి లేదా దాల్చిన చెక్క పొడిలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగుతుండాలి. దీంతో వికారం, వాంతికి వచ్చినట్లు అనిపించడం తగ్గుతాయి.
5. వికారం, వాంతులను తగ్గించడంలో యాలకులు కూడా బాగానే పనిచేస్తాయి. కొన్ని యాలకుల గింజలను నోట్లో వేసుకుని చప్పరిస్తుండాలి. లేదా యాలకులను నీటిలో వేసి మరిగించిన డికాషన్‌ను తాగుతుండాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
6. వికారం సమస్యను బేకిండ్ సోడా తగ్గిస్తుంది. అర టీస్పూన్ బేకింగ్ సోడాను ఒక గ్లాస్ వేడి నీటిలో కలిపి తాగాలి. దీంతో వెంటనే రిలీఫ్ వస్తుంది. జీర్ణాశయంలో పీహెచ్ స్థాయిలను బేకింగ్ సోడా మార్చుతుంది. దీంతో వికారం, వాంతికి వచ్చినట్లు అనిపించడం తగ్గుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365