హెల్త్ టిప్స్

ఎడమవైపుకు తిరిగి నిద్రించడం వల్ల ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా ?

చాలా మంది మంచంపై పడుకున్నప్పుడు రక రకాలుగా నిద్రిస్తుంటారు. కొందరు వెల్లకిలా పడుకుంటారు. కొందరికి బోర్లా పడుకుంటే గానీ నిద్రరాదు. ఇక కొందరు కుడి వైపుకు, కొందరు ఎడమవైపుకు తిరిగి పడుకుంటారు. అయితే శాస్త్రీయంగా చెప్పాలంటే ఎడమ వైపుకు తిరిగి పడుకుంటేనే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of sleeping on left side

1. మన శరీరంలో లింఫాటిక్‌ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలను బయటకు పంపుతుంది. ఈ క్రమంలోనే లింఫాటిక్‌ వ్యవస్థలోని ముఖ్యమైన భాగమైన తోరాకిక్‌ డక్ట్‌ ఎడమ వైపు ఉంటుంది కనుక ఎడమ వైపుకు తిరిగి పడుకుంటే శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు మరింత సమర్థవంతంగా బయటకు పంపబడతాయి. లింఫ్‌ వ్యవస్థ కొవ్వులు, ప్రోటీన్లు, ఇతర ముఖ్యమైన పదార్థాలను కణజాలాలకు చేరవేస్తుంది. ఈ క్రమంలో ఎడమవైపుకు తిరిగి పడుకోవడం వల్ల కణాలు ఆయా పోషకాలను వేగంగా గ్రహిస్తాయి. అందుకనే ఎడమ వైపుకు తిరిగి పడుకోవాలి.

2. లింఫ్‌ వ్యవస్థలో స్ల్పీన్‌ అతి పెద్ద అవయవం. ఇది కూడా శరీరంలో ఎడమ భాగంలో ఉంటుంది. అందువల్ల ఎడమ వైపు పడుకుని నిద్రిస్తే స్ల్పీన్‌ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని వల్ల స్ల్పీన్‌కు రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఈ క్రమంలో శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. అందువల్లే ఎడమ వైపుకు తిరిగి నిద్రించాలి.

3. చిన్నపేగుకు, పెద్ద పేగుకు మధ్య ఉండే ఓ జంక్షన్‌ ఎడమ వైపు ఉంటుంది. దీన్నే ఇలియోసికల్‌ వాల్వ్‌ అంటారు. ఎడమ వైపుకు తిరిగి నిద్రించినప్పుడు గురుత్వాకర్షణ బలం వల్ల చిన్నపేగులోని వ్యర్థాలు పెద్ద పేగుకు సులభంగా వెళ్తాయి. దీంతో పెద్ద పేగు నుంచి మలం సులభంగా బయటకు వస్తుంది. దీని వల్ల మలబద్దకం ఉండదు. కాబట్టి నిద్రించేటప్పుడు ఎడమ వైపుకు తిరిగి ఉండాలి.

4. గుండెల్లో మంటగా ఉన్నవారు ఎడమవైపుకు తిరిగి నిద్రిస్తే ఆ సమస్య నుంచి ఉపశమనం లబిస్తుంది.

5. మన శరీరంలో లివర్‌ కుడి వైపు ఉంటుంది కాబట్టి ఆ వైపుకు తిరిగి పడుకుంటే లివర్‌పై భారం పడుతుంది. దీంతో లివర్‌లో వ్యర్థాలు పేరుకుపోతాయి. కనుక ఎడమ వైపుకు తిరిగి నిద్రించడం మంచిది. దీంతో లివర్‌పై ఒత్తిడి పడకుండా చూసుకోవచ్చు. లివర్‌ ఆరోగ్యంగా ఉంటుంది. వ్యర్థాలను లివర్‌ సులభంగా బయటకు పంపుతుంది.

6. గుండెకు ఎడమ భాగం ఊపిరితిత్తుల నుంచి రక్తాన్ని సేకరించి దాన్ని శరీరానికి పంపుతుంది. కాబట్టి ఎడమ వైపు తిరిగి నిద్రిస్తే ఈ పని సులభంగా అవుతుంది. శరీరమంతటికీ రక్త సరఫరా సులభంగా జరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts