మనలో కొందరికి చిన్నతనంలోనే జుట్టు తెల్లబడుతుంది. కొందరికి పలు ఇతర కారణాల వల్ల ఈ సమస్య వస్తుంటుంది. పోషకాహార లోపం కూడా ఇందుకు కారణమవుతుంది. అయితే కారణాలు ఏమున్నప్పటికీ యుక్త వయస్సులోనే వెంట్రుకలు తెల్లబడితే నలుగురిలో తిరిగేందుకు ఇబ్బందిగా ఉంటుంది. దీంతో రసాయనాలతో తయారు చేసిన కలర్‌లను జుట్టుకు వేసుకుంటారు. కానీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా జరగకుండా ఉండేందుకు కింద తెలిపిన సహజసిద్ధమైన చిట్కాలను పాటించాలి. దీంతో తెల్లగా ఉండే శిరోజాలు నలుపు రంగులోకి మారుతాయి. మరి ఆ చిట్కాలు ఏమిటంటే…
1. తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చేందుకు బ్లాక్ టీ ఉపయోగపడుతుంది. పాలు కలపకుండా బ్లాక్ టీని తయారు చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత ఆ మిశ్రమాన్ని గోరు వెచ్చగా వేడి చేసి అనంతరం దాన్ని తలకు బాగా పట్టించాలి. బాగా మసాజ్ చేయాలి. సున్నితంగా మర్దనా చేయాలి. జుట్టు కుదుళ్లు తాకేలా మర్తనా చేయాలి. ఇలా మర్దనా చేశాక జుట్టును 30 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. తరువాత తలస్నానం చేయాలి. దీంతో తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి.
2. ఉసిరికాయల రసం, కొబ్బరినూనెలను బాగా కలిపి జుట్టుకు బాగా రాయాలి. దీంతో కొన్ని రోజులకు తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి.
3. కొబ్బరినూనెలో ఉసిరికాయల పొడి కలిపి కొద్దిగా వేడి చేయాలి. తరువాత రాత్రంతా దాన్ని అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఆ మిశ్రమాన్ని తలకు రాయాలి. కొంత సేపు అయ్యాక తలస్నానం చేయాలి. దీని వల్ల కూడా శిరోజాలు నల్లగా మారుతాయి.
4. గోరింటాకు పొడి లేదా హెన్నాలో కొద్దిగా పెరుగు, ధనియాలు, మెంతులు, కాఫీ డికాషన్, తులసి ఆకుల రసం, పుదీనా రసం కలపాలి. ఆ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు ఉడికించాలి. రాత్రతంతా దాన్ని అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఆ మిశ్రమాన్ని తలకు రాయాలి. 3 గంటల తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే జుట్టు నల్లబడుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365