ఆయుర్వేదంలో అశ్వగంధకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్ని అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అశ్వగంధ వేర్ల చూర్ణం మనకు లభిస్తుంది. అశ్వగంధ ట్యాబ్లెట్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే అశ్వగంధను ఉపయోగించి పలు అనారోగ్య సమస్యలు ఎలా నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా అశ్వగంధ పొడి వేసి బాగా మరిగించాలి. అనంతం ఆ డికాషన్‌ను ఒక కప్పు మోతాదులో తాగాలి. రోజుకు ఇలా రెండు సార్లు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
2. శస్త్ర చికిత్స అయిన వారు, టీబీ నుంచి కోలుకుంటున్న వారు రోజూ అశ్వగంధ ట్యాబ్లెట్లు లేదా చూర్ణం తీసుకుంటే త్వరగా కోలుకుంటారు.
3. మహిళలు రుతు క్రమం అయ్యాక వారం రోజుల పాటు రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ అశ్వగంధ పొడిని కలుపుకుని తాగాలి. దీంతో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
4. చిన్నారులకు పాలలో అశ్వగంధ పొడిని కలిపి ఇస్తుంటే వారిలో మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు.
5. ఒక టీస్పూన్ అశ్వగంధ పొడి, అంతే మోతాదులో తేనె, నెయ్యిలను కలిపి రోజూ ఒకసారి తీసుకోవాలి. దీంతో శరీరం దృఢంగా మారుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.
6. రోజూ ఉదయం అల్పాహారం తరువాత ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా అశ్వగంధ పొడి కలిపి తాగితే శక్తి బాగా అందుతుంది. రోజూ నీరసించి పోయేవారు, అలసటగా ఉందని భావించేవారు ఇలా తాగితే మంచిది.
7. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ అశ్వగంధ పొడిని కలిపి పురుషులు రోజూ రాత్రి తాగితే వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. నరాల బలహీనత తగ్గుతుంది. గాఢంగా నిద్ర పడుతుంది.
8. వెర్టిగో, తలతిరగడం, డిప్రెషన్ సమస్యలతో బాధపడేవారు రోజూ అశ్వగంధ చూర్ణాన్ని పాలతో తీసుకోవాలి. అశ్వగంధ ట్యాబ్లెట్లు కూడా వాడుకోవచ్చు.
9. ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారు అశ్వగంధ చూర్ణాన్ని రోజూ ఉదయం ఒక టీస్పూన్ మోతాదులో పాలతో కలిపి తీసుకోవాలి.
10. రోజూ అశ్వగంధ చూర్ణం లేదా ట్యాబ్లెట్లను వాడడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు. చర్మ సమస్యలు తగ్గుతాయి.
11. అశ్వగంధ చూర్ణాన్ని తీసుకుంటే శరీరంలో తెల్ల రక్త కణాలు పెరుగుతాయి. దీంతో అవి ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. రోజూ రాత్రి అశ్వగంధ పొడిని నెయ్యి లేదా చక్కెరతో తీసుకుంటే నిద్రలేమి సమస్య తగ్గుతుంది.
12. అశ్వగంధ చూర్ణం, బెల్లం కలిపి రోజూ ఒకసారి తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365