తీవ్రమైన తలనొప్పినే మైగ్రేన్ అంటారు. తలకు ఒక వైపున ఈ నొప్పి వస్తుంటుంది. మైగ్రేన్ వస్తే భరించలేనంతటి నొప్పి కలుగుతుంది. ఆ బాధ వర్ణనాతీతం. దీంతోపాటు వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం, కాంతిని చూడలేకపోవడం, శబ్దాలను వింటే నొప్పి ఎక్కువ అవడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కింద తెలిపిన పలు ఆహారాలను తీసుకోవడం వల్ల మైగ్రేన్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. దీంతో తలనొప్పి తగ్గుతుంది. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
1. అంజీర్ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది వాపులను తగ్గిస్తుంది. దీంతో మైగ్రేన్ నుంచి బయట పడవచ్చు. అంజీర్ పండ్లను నేరుగా తినవచ్చు. లేదా ఇవి డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ లభిస్తాయి. వాటిని కూడా తినవచ్చు. దీని వల్ల మైగ్రేన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. పుచ్చకాయల్లో 92 శాతం నీరు ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. పుచ్చకాయలను తినడం వల్ల మైగ్రేన్ సమస్య నుంచి బయట పడవచ్చు. ఈ వివరాలను అమెరికన్ మైగ్రేన్ ఫౌండేషన్ తెలిపింది.
3. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల అన్ని రకాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం రసాన్ని నేరుగా తీసుకోవచ్చు. లేదా అల్లంతో డికాషన్ తయారు చేసుకుని తాగవచ్చు. దీంతో మైగ్రేన్ తగ్గుతుంది.
4. పెరుగులో అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. అందువల్ల దీన్ని భోజనం చేసిన తరువాత ఒక కప్పు మోతాదులో తీసుకోవాలి. దీంతో మైగ్రేన్ రాకుండా అడ్డుకోవచ్చు.
5. చేపలు, ఆకుపచ్చని కూరగాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీని వల్ల మైగ్రేన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365