ఉల్లిపాయ‌ల‌తో ఈ 16 స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

ఉల్లిపాయ‌ల‌ను నిత్యం మ‌నం కూర‌ల్లో వేస్తుంటాం. ఇది లేకుండా అస‌లు ఎవ‌రూ కూర‌లు చేయ‌రు. కొంద‌రు వీటిని ప‌చ్చిగానే తింటారు. వేస‌విలో చాలా మంది మ‌జ్జిగ‌లో ఉల్లిపాయ‌లు, కొత్తిమీర క‌లిపి తాగుతుంటారు. ఇలా తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. అయితే ఉల్లిపాయ‌ల‌ను ఉప‌యోగించి ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

home remedies using onions

1. ఉల్లిపాయ‌ల ర‌సం, తేనెల‌ను ఒక టీస్పూన్ మోతాదు చొప్పున తీసుకుని క‌లిపి రోజూ ఉద‌యం, సాయంత్రం సేవించాలి. దీంతో హైబీపీ త‌గ్గుతుంది. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

2. భోజ‌నం చేసిన అనంత‌రం ఉల్లికాడ‌ల‌ను న‌మ‌లాలి. దీని వ‌ల్ల నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది.

3. ఉల్లిపాయ‌లు, కీర‌దోస‌, ట‌మాటాలు, క్యారెట్‌, కొత్తిమీర‌ల‌ను తీసుకుని క‌ట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ లా చేయాలి. అందులో నిమ్మ‌ర‌సం పిండి రోజుకు ఒక్క‌పూట తీసుకోవాలి. దీని వ‌ల్ల జీర్ణ‌కోశం శుభ్ర‌మ‌వుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఈ మిశ్ర‌మంలో అవ‌స‌రం అనుకుంటే రుచి కోసం కొద్దిగా ఉప్పు క‌లుపుకోవ‌చ్చు.

4. ఉల్లిపాయ‌ల ర‌సం 2 టీస్పూన్లు, తేనె 2 టీస్పూన్లు, అల్లం ర‌సం 1 టీస్పూన్ మోతాదులో తీసుకుని బాగా క‌లిపి భోజ‌నం త‌రువాత రోజూ తీసుకోవాలి. దీని వ‌ల్ల ఆయాసం, ద‌గ్గు త‌గ్గుతాయి. ఆక‌లి బాగా అవుతుంది.

5. ఉల్లిపాయ‌ల రసం 1 టీస్పూన్‌, తేనె 1 టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుని రెండింటినీ క‌లిపి రోజుకు 3 పూట‌లా తాగాలి. దీని వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు త‌గ్గుతాయి. టాన్సిల్స్ స‌మ‌స్య ఉన్న‌వారికి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. టాన్సిల్స్ వాపులు త‌గ్గుతాయి.

6. ఆవ‌నూనెతో ఉల్లిపాయ‌ల‌ను మెత్త‌గా నూరాలి. అనంత‌రం వ‌చ్చే పేస్ట్‌ను కీళ్ల నొప్పులు ఉన్న చోట రాయాలి. దీంతో కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.

7. కొద్దిగా నెయ్యిని వేడి చేసి దాన్ని చ‌ర్మంపై గ‌డ్డ‌లు ఉండే చోట రాయాలి. అనంత‌రం ఉల్లిపాయ‌ల‌ను ఉడికించి నూరి ఆ మిశ్ర‌మాన్ని ఆయా భాగాల‌పై రాయాలి. త‌రువాత క‌ట్టు క‌ట్టాలి. దీంతో గ‌డ్డ‌లు మెత్త‌బ‌డి ప‌గిలిపోతాయి. స‌మ‌స్య త‌గ్గుతుంది.

8. కొంద‌రికి ముక్కు నుంచి ఒక్కోసారి ర‌క్తం కారుతుంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే అలాంటి స‌మ‌స్య ఉన్న‌వారు ముక్కు రంధ్రాల్లో ఉల్లిపాయ‌ల ర‌సాన్ని వేయాలి. దీంతో రక్తం కార‌డం త‌గ్గుతుంది.

9. ఉల్లిపాయ‌ల ర‌సాన్ని వేడి చేసి 5, 6 చుక్క‌ల మోతాదులో చెవుల్లో వేయాలి. దీంతో చెవి నొప్పి త‌గ్గుతుంది.

10. పాదాల‌ ప‌గుళ్లు ఉన్న‌వారు వాటి మీద ఉల్లిపాయ‌ల‌ను రోజూ మ‌ర్ద‌నా చేసిన‌ట్లు రాయాలి. దీని వ‌ల్ల పాదాల ప‌గుళ్లు త‌గ్గుతాయి. చ‌ర్మం మృదువుగా మారుతుంది.

11. ఉల్లిపాయ‌ల ర‌సంలో కొద్దిగా దూదిని ముంచి ఆ దూదిని చెవిలో పెట్టుకోవాలి. దీంతో చెవిలో వ‌చ్చే శ‌బ్దాలు త‌గ్గుతాయి.

12. ఉల్లిపాయ‌ల‌ను బాగా దంచి ఆ మిశ్ర‌మాన్ని మంచం కింద కొన్ని చోట్ల ఉంచాలి. దీంతో దోమ‌లు రావు.

13. ఉల్లిపాయ‌లు, మెంతికూర‌, కొబ్బ‌రిబెల్లంతో కిచిడీ త‌యారు చేసి బాలింత‌ల‌కు పెట్టాలి. దీంతో వారిలో పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి.

14. ఉల్లిపాయ‌ల ర‌సం 1 టీస్పూన్‌, వెనిగ‌ర్ 1 టీస్పూన్‌, తేనె త‌గినంత క‌లిపి చిన్నారుల‌కు తాగించాలి. వారం రోజుల పాటు రోజుకు ఒక్క‌సారి ఈ మిశ్ర‌మాన్ని వారిచే తినిపించాలి. దీని వ‌ల్ల నులిపురుగుల స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు.

15. ఉల్లిపాయ‌ల‌ను చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి. అనంత‌రం వాటిల్లో చ‌క్కెర క‌ల‌పాలి. త‌రువాత ఆ మిశ్ర‌మాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. దీంతో ఆ మిశ్ర‌మంపై ద్ర‌వం ఏర్ప‌డుతుంది. దానిపై తేట‌ను సేక‌రించి రోజుకు 3 సార్లు తీసుకోవాలి. దీని వ‌ల్ల ద‌గ్గు, ఊపిరితిత్తుల వ్యాధులు, బ్రాంకైటిస్ వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

16. ప‌చ్చి మామిడి కాయ‌ల ర‌సం, ఉల్లిపాయ‌ల ర‌సం, కొద్దిగా ఉప్పు క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని తీసుకుంటే వ‌డ‌దెబ్బ వ‌ల్ల క‌లిగే ప్ర‌భావం త‌గ్గుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts