వేసవికాలంలో మనకు మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి. ఎక్కడ చూసినా భిన్న జాతులకు చెందిన మామిడి పండ్లు నోరూరిస్తుంటాయి. కొన్ని రసాల రూపంలో ఉంటాయి. కొన్ని కోత రూపంలో ఉంటాయి. అయితే మామిడి పండు వేసవి సీజనల్ ఫ్రూట్. కనుక దీన్ని ఈ సీజన్‌లో తప్పకుండా తీసుకోవాలి. మామిడి పండును కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆ పండ్లను తినడం వల్ల అలాంటి అద్భుమైన ప్రయోజనాలు కలుగుతాయి మరి. కనుక వేసవిలో కచ్చితంగా మామిడి పండ్లను తినాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.
1. మామిడి పండ్లలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్ సి, కాపర్, ఫోలేట్, విటమిన్ బి6, ఎ, ఇ, బి5, కె, నియాసిన్, పొటాషియం, రైబోఫ్లేవిన్, మాంగనీస్, థయామిన్, మెగ్నిషియం తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల శరీరానికి పోషణ లభిస్తుంది. పోషకాహార లోపం రాకుండా చూసుకోవచ్చు.
2. మామిడిపండ్లలో పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. అలాగే మాంగిఫెరిన్, కాటెచిన్స్, ఆంథోసయనిన్స్, క్వర్సెటిన్, కెంప్‌ఫెరాల్, రామ్నెటిన్, బెంజోయిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. దీని వల్ల శరీరంలో కణాలు రక్షించబడతాయి. ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అవుతాయి. క్యాన్సర్లు, డయాబెటిస్, ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
3. మామిడి పండ్లలో రోగ నిరోధక శక్తిని పెంచే అనేక పోషకాలు ఉంటాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్ ఎ, ఫోలేట్, విటమిన్ కె, ఇ, ఇతర బి విటమిన్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
4. మామడి పండ్లలో ఉండే మెగ్నిషియం, పొటాషియంలు హైబీపీని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఈ పండ్లలో మాంగిఫెరిన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది వాపులను, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. దీని వల్ల కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
5. మామిడిపండ్లను తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ పండ్లలో అనేక డైజెస్టివ్ ఎంజైమ్‌లు ఉంటాయి. వాటిని అమైలేజెస్ అని పిలుస్తారు. ఇవి మనం తినే ఆహారాలను సులభంగా జీర్ణం చేస్తాయి. దీని వల్ల ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. అలాగే ఈ పండ్లలో ఉండే ఫైబర్ మలబద్దకం, డయేరియా వంటి సమస్యలను తగ్గిస్తుంది. రోజూ మామిడి పండ్లను తినడం వల్ల మలబద్దకం ఉండదు.
6. మామిడి పండ్లలో విటమిన్ ఎ, లుటీన్, జియాంతిన్‌లు ఉంటాయి. ఇవి కళ్లలోని రెటీనాను సంరక్షిస్తాయి. సూర్య కిరణాల బారి నుంచి కళ్లను రక్షిస్తాయి. కళ్లు పొడిబారడం, రేచీకటి వంటి కంటి సమస్యలు తగ్గుతాయి.
7. మామిడి పండ్లలో ఉండే విటమిన్ పి వెంట్రుకలు, చర్మాన్ని సంరక్షిస్తుంది. ఈ విటమిన్ వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మం, వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వల్ల చర్మం ముడతలు పడదు. వెంట్రుకలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365