మనలో చాలా మందికి చంక భాగంలో చర్మం నలుపు రంగులో ఉంటుంది. ఈ సమస్యలతో బాధపడే వారు చాలా మందే ఉంటారు. దీని వల్ల ఎటువంటి హాని లేనప్పటికీ వారికి ఇష్టమైన దుస్తులు ధరించలేక ఇబ్బందులు పడుతుంటారు. కొందరిలో చర్మం అంతా తెలుపు రంగులో ఉన్నప్పటికీ చంక భాగం మాత్రం నలుపు రంగులో ఉంటుంది. చంక భాగంలో నల్లగా ఉండడానికి రెండు రకాల కారణాలు ఉంటాయి. ఇన్సులిన్ ను అధికంగా తీసుకోవడం, హార్మోన్ల అసమతుల్యత, అధిక బరువు వల్ల కొందరిలో చంక భాగంలో చర్మం నల్లగా మారుతుంది.
మరికొందరిలో వారు షేవింగ్ చేసుకునే విధానం, అధిక రసాయనాలు కలిగిన డియోడరెంట్లను వాడడం వంటి కారణాల వల్ల చంక భాగం నల్లగా మారుతుంది. అనారోగ్య కారణాల వల్ల చంక భాగం నల్లగా మారిన వారు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఇతర కారణాల వల్ల చంక భాగంలో చర్మం నల్లగా మారిన వారు ఇంటి చిట్కాలను ఉపయోగించి ఆ భాగంలో చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు. చంక భాగంలో ఉండే నలుపును పోగొట్టే ఇంటి చిట్కా ఏమిటి.. ఈ చిట్కాను ఎలా వాడాలి.. వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందుకోసం మసం తెల్లగా ఉండే ఏదో ఒక టూత్ పేస్ట్ ను, అర చెక్క నిమ్మకాయను ఉపయోగించాల్సి ఉంటుంది. చంక భాగం నల్లగా ఉన్న వారు ముందుగా ఆ భాగంలో టూత్ పేస్ట్ ను రాయాలి. తరువాత నిమ్మ చెక్కను తీసుకుని టూత్ పేస్ట్ పై వృత్తాకారంలో రుద్దుతూ 5 నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఇలా మర్దనా చేసేటప్పుడు నిమ్మ చెక్కను పిండుతూ నిమ్మరసం, టూత్ పేస్ట్ రెండూ కలిసేలా చూసుకోవాలి.
ఇలా మర్దనా చేసిన తరువాత టూత్ పేస్ట్ ను పూర్తిగా ఆరనివ్వాలి. తరువాత ఆ భాగాన్ని నీటితో కాకుండా తడి గుడ్డతో శుభ్రపరుచుకోవాలి. ఇలా శుభ్రపరిచిన తరువాత చంక భాగంలో మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చంక భాగంలో ఉండే నలుపు తొలగిపోయి చర్మం తెల్లగా మారుతుంది. ఈ చిట్కాను పాటించడం వల్ల ఎటువంటి దుష్పభ్రావాలు లేకుండానే చాలా తక్కువ ఖర్చుతోనే చంక భాగంలో చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.