జలుబును తగ్గించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుందంటారు. వెల్లుల్లిపాయ పైపొర తీసేసి నోట్లో ఉంచుకోవాలి. తరుచుగా ఆ వెల్లుల్లిని కొరుకుతూ దాని నుంచి వచ్చే రసం మింగుతుండాలి. అలా నాలుగైదు గంటలకు ఓసారి కొత్త వెల్లుల్లిపాయను నోట్లో ఉంచుకుని రసం మింగాలి.
ఇలా చేయడం వల్ల జలుబు వల్ల వచ్చే ఇబ్బంది ఒకటి రెండు రోజుల్లోనే తొలగిపోతుంది. జలుబు చేసినపుడు ముక్కు దిబ్బడ వల్ల ఇబ్బంది పడుతుంటే వేడి వేడి లేదా మసాలా వేసి వండిన ఆహారాన్ని తీసుకోవాలి. దీంతో మూసుకుపోయిన నాసికా రంధ్రాలు తెరుచుకుంటాయి. అనవసరంగా నోస్ డ్రాప్స్ లాంటివి కూడా వాడే పరిస్థితి తప్పుతుంది.
కొన్ని నిమిషాలపాటే శక్తి అంతా ఉపయోగించి వ్యాయామం చేసినా ఫలితం వుంటుంది. అప్పుడు మీ శరీరానికి ఆక్సిజన్ అవసరం పెరుగుతుంది. దాంతో మీరు గాఢంగా శ్వాసించడంతో జలుబు వల్ల మూసుకునే నాసికా రంధ్రాలు సహజంగానే తెరుచుకుంటాయి. ఛాతి దగ్గర ఇబ్బంది కూడా తొలగిపోతుంది.
జలుబు చేసినపుడు వేడివేడి వెనిగర్ ద్రావణం లేదా వైట్ వైన్ వాసన పీల్చినా ఫలితం ఉంటుంది. కొన్ని నిమిషాలసేపు వాటి వాసనలు పీలిస్తే ఉపశమనం లభిస్తుంది. బలుబుతోపాటు వచ్చే దగ్గు, గొంతు గరగరలకి కూడా కొన్ని గృహ వైద్య చిట్కాలున్నాయి. ఓ పెద్ద నిమ్మకాయను తీసుకుని దానంతట అది రెండుగా విడిపోయేదాకా నెమ్మదిగా వేయించి, అప్పుడు దాని రసం తీసి దానికి అరస్పూన్ తేనె కలిపి తాగాలి. దగ్గు తగ్గుతుందనిపించేంత వరకూ గంటకోసారి ఇలా చేస్తుండాలి.