Headache : ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ ఉరుకుల పరుగుల బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. దీంతో ఒత్తిడి, ఆందోళన అధికమవుతున్నాయి. ఫలితంగా చాలా మందికి తలనొప్పి వస్తోంది. అయితే తలనొప్పి వచ్చేందుకు ఇవే కాదు.. ఇంకా అనేక కారణాలు ఉంటాయి. కానీ ఎలాంటి తలనొప్పిని అయినా సరే కింద తెలిపిన పలు చిట్కాలను పాటించడం వల్ల వెంటనే తగ్గించుకోవచ్చు. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. తలనొప్పిని తగ్గించడంలో నల్ల ద్రాక్ష బాగా పనిచేస్తుంది. బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక కప్పు నల్ల ద్రాక్షలను తినాలి. లేదా ఒక గ్లాస్ జ్యూస్ అయినా తాగవచ్చు. దీంతో తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
2. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల తలనొప్పికి ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక టీస్పూన్ అల్లం రసంలో కాస్త తేనె కలిపి తాగితే తలనొప్పి నుంచి వెంటనే బయట పడవచ్చు.
3. దాల్చిన చెక్కను మసాలా వంటల్లో వేస్తుంటారు. అయితే ఇందులో అద్భుతమైన ఔషధగుణాలు ఉంటాయి. కనుక ఇది తలనొప్పిని తగ్గిస్తుంది. అందుకు గాను చిన్న దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటిని కప్పు మోతాదులో తీసుకుని అందులో కాస్త తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. దీంతో తలనొప్పి తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
4. ఒక్కోసారి డీహైడ్రేషన్ వల్ల కూడా తలనొప్పి వస్తుంటుంది. శరీరంలో ఎండ కారణంగా నీరు త్వరగా అయిపోయినా.. లేదా నీళ్లను సరిగ్గా తాగకపోయినా.. ఇలాంటి నొప్పి వస్తుంది. ఇందుకు గాను ఒక గ్లాస్ మజ్జిగలో కాస్త శొంఠి పొడి కలిపి తాగాలి. లేదా ఒక కీరదోసను నేరుగా అలాగే తినవచ్చు. దీంతో తలనొప్పి నుంచి విముక్తి లభిస్తుంది.