Joint Pains : చ‌లికాలంలో కీళ్ల నొప్పులు ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Joint Pains : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది వివిధ ర‌కాల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారు. మెడ నొప్పి, న‌డుము నొప్పి, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఇలా వివిధ ర‌కాల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. పిల్ల‌ల నుండి పెద్దల వ‌ర‌కు ఇలా ప్ర‌తి ఒక్క‌రు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, గంటల కొద్ది కూర్చుని చేయ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, అధిక బ‌రువు, సెల్ ఫోన్స్ ను ఎక్కువ‌గా వినియోగించ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఇలా అనేక ర‌కాల నొప్పుల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. చాలా మంది ఈ నొప్పుల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఎక్కువ‌గా పెయిన్ కిల్ల‌ర్ ల‌ను వాడుతూ ఉంటారు.

అలాగే అనేక ర‌కాల స్ప్రేల‌ను వాడుతూ ఉంటారు. వీటి వ‌ల్ల ఉపశ‌మ‌నం ల‌భించిన‌ప్ప‌టికి వీటిని వాడ‌డం మ‌న ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కేవ‌లం మందుల ద్వారా మాత్ర‌మే కాకుండా స‌హ‌జ సిద్దంగా కూడా ఈ నొప్పుల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు ఇప్పుడు చెప్పే చిట్కాను వాడ‌డం వ‌ల్ల నొప్పుల నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. దీనికోసం మ‌నం ఆవ‌నూనెను, ముద్ద క‌ర్పూరాన్ని ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఆవ‌నూనెలో ముద్ద క‌ర్పూరాన్ని వేసి బాగా క‌లపాలి. ఇలా త‌యారు చేసుకున్న నూనెను నొప్పి ఉన్న భాగంలో రాసి నూనె లోప‌లికి ఇంకేలా సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. త‌రువాత వేడి నీటితో కాప‌డం పెట్టాలి.

Joint Pains in winter follow these home remedies
Joint Pains

ఇలా చేయ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, న‌డుము నొప్పి, కండ‌రాల నొప్పులు చాలా సుల‌భంగా త‌గ్గుతాయి. ఆవ నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌తో పాటు యాంటీ ఇన్ ప్లామేట‌రీ లక్ష‌ణాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి. ఇవి నొప్పులను, వాపుల‌ను త‌గ్గించ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల నొప్పుల నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు మందుల‌కు బ‌దులుగా ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేని ఇటువంటి స‌హ‌జ చిట్కాల‌ను వాడ‌డం మంచిది.

Share
D

Recent Posts