Knee Pain : నేటి తరుణంలో చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, తుంటి నొప్పి వంటి వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ నొప్పుల బారిన పడుతున్నారు. పోషకాహా లోపం, మారిన మన అలవాట్లు, జీవన విధానం, అధిక బరువు, వాతం ఎక్కువవడం, కీళ్ల మధ్య జిగురు తగ్గడం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. చాలా మంది నొప్పులను తగ్గించడానికి పెయిన్ కిల్లర్ లను వాడుతూ ఉంటారు. పెయిన్ కిల్లర్ లను వాడడం వల్ల అప్పటికప్పుడు నొప్పి తగ్గినప్పటికి వీటిని వాడడం వల్ల అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పెయిక్ కిల్లర్ లను వాడే అవసరం లేకుండా చక్కటి ఆయుర్వేద చిట్కాను వాడడం వల్ల మనం చాలా సులభంగా కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు.
ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. కీళ్ల నొప్పులను తగ్గించే ఈ ఆయుర్వేద చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగ మనం ఒక కప్పు నల్ల బెల్లం తురుమును, ఒక టీ స్పూన్ ఆర్గానిక్ పసుపును, పావు టేబుల్ స్పూన్ సున్నాన్ని, ఒక జాజికాయ పొడిని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక కళాయిలో బెల్లం తురుమును, పసుపును వేసి కలుపుతూ వేడి చేయాలి. బెల్లం కొద్దిగా కరిగిన తరువాత సున్నాన్ని రెండు టీ స్పూన్ల నీటిలో వేసి కరిగించి వేసుకోవాలి. తరువాత జాజికాయ పొడిని వేసి కలపాలి. దీనిని గోరు వెచ్చగా అయ్యే వరకు కలుపుతూ వేడి చేయాలి. ఇలా వేడి చేసిన తరువాత ఈ మిశ్రమాన్ని చేత్తో తీసుకుంటూ కీళ్ల నొప్పులపై రాసుకోవాలి.
రోజూ రాత్రి పడుకునే ముందు ఈమివ్రమాన్ని నొప్పులు ఉన్న చోట రాసుకుని దానిపై పట్టీని కట్టుకోవాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు క్రమంగా తగ్గుతాయి. ఈచిట్కాను పాటించడంతో పాటు రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా వేడి చేసుకుని తినాలి. వీటిని రోజూ ఉదయం పరగడుపున తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వాతం కారణంగా కూడా శరీరంలో కీళ్ల నొప్పులు తలెత్తుతాయి. వెల్లుల్లి వాతాన్ని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. వాతం తగ్గడం వల్ల క్రమంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ విధంగా ఈ చిట్కాలను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మనం చాలా సులభంగా కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు.