Kovvu Gaddalu : మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో కొవ్వు గడ్డలు కూడా ఒకటి. వీటిని లిపోమా అని కూడా అంటారు. ఈ సమస్యతో బాధపడే వారు కూడా మనలో చాలా మంది ఉండే ఉంటారు. ఈ కొవ్వు గడ్డలు మన శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ఇవి ఎక్కువగా చేతులు, కాళ్లు, పొట్ట, భుజాలు వంటి భాగాల్లో ఎక్కువగా వస్తాయి. ఈ గడ్డలు మనకు ఎటువంటి నొప్పిని, హానిని కలిగించవు. చాలా తక్కువ సందర్భాల్లోనే వీటి వల్ల మనకు హాని కలుగుతుంది. కొన్ని గడ్డలు నరాల మీద వచ్చి నొప్పిని కలిగిస్తాయి. ఈ సమస్య తలెత్తడానికి ప్రత్యేక కారణాలంటూ ఏవి ఉండవు. శరీరంలో వ్యర్థ పదార్థాలు అక్కడక్కడ పేరుకుపోయి ఇలా గడ్డలుగా మారతాయి. ఈ గడ్డలను తొలగించడానికి వైద్యులు శస్త్ర చికిత్సలను సూచిస్తారు.
ఇటువంటి కొవ్వు గడ్డలను మనం ఆయుర్వేదం ద్వారా కూడా తొలగించుకోవచ్చు. కొవ్వు గడ్డలను, కణతులను తొలగించే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రోట్లో ఒక వెల్లుల్లి రెబ్బను మెత్తగా దంచుకోవాలి. తరువాత ఇందులో కలబంద గుజ్జును వేసి రెండు కలిసేలా బాగా దంచాలి. తరువాత అర టీ స్పూన్ పసుపును వేసి మరలా దంచాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని గిన్నెలో వేసి మూడు రోజు పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని వాడే ముందు దీనిని వేడి చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకోవాలి.
తరువాత ఈ నీటిలో కలబంద మిశ్రమం ఉన్న గిన్నెను ఉంచి కలుపుతూ వేడి చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని తీసుకుని కొవ్వు గడ్డలపై లేపనంగా రాయాలి. ఈ మిశ్రమాన్ని 30 నుండి 45 నిమిషాల వరకు అలాగే ఉంచి తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం రోజుల పాటు చేయడం వల్ల కొవ్వు గడ్డలు కరిగిపోతాయి. ఈ మిశ్రమాన్ని ఉపయోగించే ప్రతిసారి వేడి చేసుకోవాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఔషధ గుణాలు కలిగిన రెడ్డి వారి నానుబాలు మొక్కను ఉపయోగించి కూడా మనం కొవ్వు గడ్డలను కరిగించుకోవచ్చు. ఈ మొక్కను తుంచినప్పుడు పాల వంటి పదార్థం వస్తుంది.
ఈ పాలను సేకరించి కొవ్వు గడ్డలపై రాస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కొవ్వు గడ్డలు కరిగిపోతాయి. అలాగే మునగ చెట్టు బెరడు కూడా కొవ్వు గడ్డలను కరిగించడంలో మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ బెరడును నీటితో అరగదీసి గంధంలా చేసుకోవాలి. ఈ గంధాన్ని కొవ్వు గడ్డలపై రాయడం వల్ల క్రమంగా గడ్డలు కరిగిపోతాయి. అదేవిధంగా మందార ఆకులను, జామాయిల్ ఆకులను సేకరించి ఈ రెండింటిని కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను కొవ్వు గడ్డలపై రాస్తూ ఉంటే గడ్డలు కరిగిపోతాయి. ఈ చిట్కాలను పాటిస్తూ మన ఆహారంలో చేదుగా ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల కొవ్వు గడ్డలు ఇట్టే కరిగిపోతాయి.