Kovvu Gaddalu : శ‌రీరంలో ఎక్క‌డ కొవ్వు గ‌డ్డ‌లు ఉన్నా స‌రే.. ఇలా చేయండి చాలు..!

Kovvu Gaddalu : కొవ్వు గ‌డ్డ‌లు.. ఈ స‌మ‌స్య‌తో కూడా మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. ఇవి శ‌రీరంలో ఎక్క‌డైనా ఏర్ప‌డ‌వ‌చ్చు. అలాగే ఈ గ‌డ్డ‌లు వివిధ ప‌రిమాణాల్లో ఏర్ప‌డుతూ ఉంటాయి. ఈ కొవ్వు గ‌డ్డ‌ల‌ను ఎడిమాఅని కూడా అంటారు. సాధార‌ణంగా ఈ కొవ్వు గ‌డ్డ‌లు ఎటువంటి నొప్పిని క‌లిగించ‌వు. అలాగే ఎటువంటి ఇబ్బంది కూడా ఉండ‌దు.అయితే కొన్ని సార్లు ఇవి న‌రాల‌పై ఏర్ప‌డుతూ ఉంటాయి. అలాంటి స‌మ‌యంలో కొద్దిగా నొప్పి క‌లుగుతుంది. అయితే కొవ్వు గడ్డ‌ల వ‌ల్ల ఎటువంటి న‌ష్టం లేన‌ప్ప‌టికి ఇవి కొన్నిసార్లు క్యాన్స‌ర్ గ‌డ్డ‌లుగా మారే అవ‌కాశం కూడా ఉంటుంది. చాలా మంది శ‌స్త్ర చికిత్స ఒక్క‌టే ఈ గ‌డ్డ‌లను నివారించ‌డానికి మార్గ‌మ‌ని భావిస్తూ ఉంటారు. కానీ ఆయుర్వేద చిట్కాను ఉప‌యోగించి కూడా మ‌నం ఈ స‌మస్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. కొవ్వు గ‌డ్డ‌ల‌ను నివారించే ఆయుర్వేద చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ప‌చ్చి ప‌సుపును, నాలుగు ల‌వంగాల పొడిని, ఒక టీ స్పూన్ ఆవ నూనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ప‌సుపులో ఉండే ఔష‌ధ గుణాలు వాపును తగ్గించి గ‌డ్డలు క‌రిగేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే ల‌వంగాల్లో యూజినాల్ ఉంటుంది. ఇది స‌హ‌జ‌మైన మ‌త్తు మందులా ప‌ని చేస్తుంది. నొప్పిని త‌గ్గించ‌డంలో ఇది చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. అలాగే నరాల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో ఆవ‌నూనె చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. ఆవ నూనె వేడి చేసే గుణాన్ని క‌లిగి ఉంటుంది. ఈ వేడి కార‌ణంగా గ‌డ్డ‌లు చ‌క్క‌గా క‌రిగిపోతాయి. ఈ ప‌దార్థాల‌తో చిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ప‌చ్చి ప‌సుపు లేదా ఆర్గానిక్ ప‌సుపును ఉప‌యోగించాలి.

Kovvu Gaddalu telugu how to remove them remedies
Kovvu Gaddalu

ర‌సాయ‌నాలు క‌లిగిన ప‌సుపును మాత్రం ఉప‌యోగించ‌కూడ‌దు. ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ ప‌సుపును తీసుకోవాలి. త‌రువాత ఇందులో ల‌వంగాల పొడిని వేసి క‌ల‌పాలి. త‌రువాత ఆవ నూనె వేసి పేస్ట్ లా చేసుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని గ‌డ్డ‌ల‌పైరాసి వ‌స్త్రంతో క‌ట్టు క‌ట్టాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచి ఉద‌యాన్నే శుభ్రం చేసుకోవాలి. ఇలా గ‌డ్డ‌లు త‌గ్గే వ‌ర‌కు ఈ చిట్కాను పాటించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కొవ్వు గడ్డ‌లు చాలా సుల‌భంగా క‌రిగిపోతాయి. ఈచిట్కాను పాటించ‌డం వ‌ల్ల ఎటువంటి హాని లేకుండా చాలా సుల‌భంగా కొవ్వు గడ్డ‌ల‌ను నివారించుకోవ‌చ్చు.

D

Recent Posts