Kuppintaku : ఈ మొక్క క‌నిపిస్తే చాలు.. పైసా ఖ‌ర్చు లేకుండా మోకాళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు..!

Kuppintaku : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల‌తో బాధప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. పూర్వ‌కాలంలో కేవ‌లం పెద్ద వారిలోనే క‌నిపించే ఈ నొప్పులు నేటి త‌రుణంలో అంద‌రిలో క‌నిపిస్తున్నాయి. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, ఎక్కువ‌సేపు ఒకే చోట కూర్చొని ప‌ని చేయ‌డం, పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోక‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను, ఆమ్ల‌త్వం క‌లిగిన ఆహారాన్ని ఎక్కువ‌గా తీసుకోవ‌డం, అధిక బ‌రువు వంటి వివిధ కార‌ణాల చేత మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వ‌స్తూ ఉంటాయి. చాలా మంది ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌గానే పెయిన్ కిల్ల‌ర్ ల‌ను వాడుతూ ఉంటారు.

మందుల‌ను వాడ‌డం వ‌ల్ల నొప్పుల నుండి ఉప‌శ‌మ‌నం క‌లిగిన‌ప్ప‌టికి వీటిని దీర్ఘ‌కాలం పాటు వాడ‌డం వ‌ల్ల అనేక దుష్ప్ర‌భావాలు ఉంటాయి. ఇటువంటి మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో మ‌న‌కు కుప్పింటాకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. కుప్పింటాకు మ‌న‌కు ఎక్కువ‌గా పొలాల గట్ల మీద‌, రోడ్డుకు ఇరు వైపులా క‌నిపిస్తూ ఉంటుంది. ఈ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు కానీ దీని ఉప‌యోగాలు తెలియ‌క చాలా మంది దీనిని పిచ్చి మొక్క‌గా భావిస్తూ ఉంటారు. కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో ఈ మొక్క దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తుంది. అయితే కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు ఈ మొక్క‌ను ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం శుభ్ర‌మైన ప్ర‌దేశంలో పెరిగిన కుప్పింటాకు మొక్క ఆకుల‌ను సేక‌రించాలి. వీటిని ఎండ‌బెట్టి పొడిగా చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేయాలి.

Kuppintaku for knee pains and other benefits
Kuppintaku

ఈ నీటిని అర గ్లాస్ అయ్యే వ‌ర‌కు బాగా మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి అందులో రెండు టీ స్పూన్ల అల్లం ర‌సం క‌లిపి తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు త‌గ్గుతాయి. అలాగే కుప్పింటాకు ఆకుల రసాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి. దీనికి స‌మానంగా నిమ్మ‌ర‌సాన్ని క‌లిపి నొప్పి ఉన్న ప్రాంతంలో రాసి సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా నొప్పులు త‌గ్గుతాయి. ఈ విధంగా మోకాళ్ల నొప్పుల‌ను, కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో కుప్పింటాకు మొక్క మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని దీనిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts