Sweet Lassi : ఎండ‌వేడిని త‌ట్టుకోవాలంటే.. ఇలా చ‌ల్ల‌ని ల‌స్సీని త‌యారు చేసి తాగండి..!

Sweet Lassi : వేసవికాలంలో మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా ల‌భించే వాటిల్లో లస్సీ కూడా ఒక‌టి. పెరుగుతో చేసే ఈ ల‌స్సీ చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌కు వివిధ రుచుల్లో కూడా ఈ లస్సీ ల‌భిస్తూ ఉంటుంది. వాటిల్లో స్వీట్ ల‌స్సీ కూడా ఒక‌టి. పంచ‌దార వేసి చేసే ఈ స్వీట్ ల‌స్సీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తాగ‌డం వ‌ల్ల ఎండ నుండి ఉప‌శ‌మ‌నం క‌ల‌గ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. పిల్ల‌లు కూడా దీనిని ఇష్టంగా తాగుతారు.కేవ‌లం 5 నిమిషాల్లోనే దీనిని మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. అంద‌రికి న‌చ్చేలా స్వీట్ ల‌స్సీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

స్వీట్ ల‌స్సీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిక్క‌టి తియ్య‌టి పెరుగు – ఒక క‌ప్పు, ఐస్ క్యూబ్స్ – త‌గిన‌న్ని, పంచ‌దార – 4 టేబుల్ స్పూన్స్, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ లేదా మీగ‌డ‌ – ఒక టీ స్పూన్.

Sweet Lassi recipe in telugu very tasty cools body
Sweet Lassi

స్వీట్ ల‌స్సీ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో పెరుగు, ఐస్ క్యూబ్స్, పంచ‌దార‌, యాల‌కుల పొడి వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ లస్సీని గ్లాస్ లోకి తీసుకోవాలి. త‌రువాత దీనిపై మీగ‌డ‌ను వేసుకోవాలి. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ ను చల్లుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్వీట్ లస్సీ త‌యారవుతుంది. పెరుగును గిన్నెలో వేసి మ‌నం క‌వ్వంతో కూడా చిల‌క‌వ‌చ్చు. ఈ విధంగా స్వీట్ ల‌స్సీని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం వేసవికాలంలో ఎండ నుండి ఉప‌శ‌మ‌నం ల‌భించ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. శీత‌ల పానీయాల‌ర‌ను తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవ‌డానికి బ‌దులుగా ఇలా ఇంట్లోనే ల‌స్సీన‌పి త‌యారు చేసుకుని తాగ‌డం మంచిది.

Share
D

Recent Posts