Onion Juice For Hair : ఈ ర‌సాన్ని వాడితే చాలు.. చుక్క‌కు కొన్ని వంద‌ల వెంట్రుక‌లు పెరుగుతాయి..!

Onion Juice For Hair : జుట్టు రాల‌డం.. ఈ స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నార‌ని చెప్ప‌వ‌చ్చు. జుట్టు రాల‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌, పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం, జుట్టును స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వంటి అనేక కార‌ణాల చేత జుట్టు రాలిపోతూ ఉంటుంది. చాలా మంది దీని వ‌ల్ల మ‌రింత ఒత్తిడికి గురి అవుతున్నార‌నే చెప్ప‌వ‌చ్చు. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించి జుట్టు ఒత్తుగా పెరగాల‌ని చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. అయితే ఎటువంటి ఖర్చు లేకుండా కేవ‌లం మ‌న ఇంట్లో ఉండే ఉల్లిపాయ‌తో జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయ‌డంలో ఉల్లిపాయ మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ఉల్లిపాయ‌లో ఉండే కాఫిరాల్ అనే ర‌సాయ‌న స‌మ్మేళ‌నం ఎక్కువ‌గా ఉంటుంది.

ఈ ర‌సాయ‌న స‌మ్మేళ‌నం జుట్టు కుదుళ్ల‌ల్లో ఉండే ర‌క్త‌నాళాలు వ్యాకోచించి జుట్టుకు ఎక్కువ‌గా ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ జ‌రిగేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. దీంతో ర‌క్తంలో ఉండే పోష‌కాలు జుట్టు కుదుళ్ల‌కు చ‌క్క‌గా అందుతాయి. పోష‌కాలు అంద‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అదే విధంగా జుట్టు పెరుగుద‌ల‌కు స‌ల్ఫ‌ర్ ఎంతో అవ‌స‌రం. జుట్టు పెరుగుద‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే ఈ స‌ల్ఫ‌ర్ ఉల్లిపాయ‌లో అధికంగా ఉంటుంది. క‌నుక ఉల్లిపాయ‌ను వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గి జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది. ఈ విధంగా ఉల్లిపాయ జుట్టు పెరుగుద‌ల‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంద‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా కూడా వెల్ల‌డించారు. అయితే మ‌న జుట్టు పెరుగుద‌ల‌కు ఎంతో స‌హాయ‌ప‌డే ఈ ఉల్లిపాయ‌ను ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ఒక పెద్ద ఉల్లిపాయ‌ను ముక్క‌లుగా క‌ట్ చేసి జార్ లో వేసుకోవాలి.

Onion Juice For Hair how to use it for better results
Onion Juice For Hair

త‌రువాత దీనిని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని దాని నుండి చిక్క‌టి ర‌సాన్ని తీయాలి. ఈ ర‌సాన్ని త‌ల‌కు బాగా ప‌ట్టించాలి. త‌రువాత 5 నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేసుకోవాలి. దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు కుదుళ్లు బ‌లంగా త‌యార‌వుతాయి. జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది. జుట్టు ఎక్కువ‌గా రాలిపోతున్న వారు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts