Egg Curry Without Masala : మ‌సాలాలు లేకుండా కోడిగుడ్డు కూర‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Egg Curry Without Masala : కోడిగుడ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న‌సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావల్సిన పోష‌కాలను కూడా అందించ‌వ‌చ్చు. కోడిగుడ్డుతో చేసుకోద‌గిన వంట‌కాల్లో కోడిగుడ్డు పులుసు కూడా ఒక‌టి. ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఈ కోడిగుడ్డు పులుసును చ‌పాతీలోకి కూడా తినేలా, మసాలాలు వేయ‌కుండా పులుసు చిక్క‌గా ఉండేలా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ విధంగా చేసే కోడిగుడ్డు పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా సుల‌భం. మ‌సాలాలు వేయ‌కుండా, చిక్క‌గా ఉండేలా కోడిగుడ్డు పులుసును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కోడిగుడ్డు పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కోడిగుడ్లు – 5, నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయలు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, ట‌మాటాలు – 3, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్ లేదా త‌గినంత‌, మెంతి పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ప‌లుచ‌టి చింత‌పండు ర‌సం – 1/3 క‌ప్పు, నీళ్లు – 1/3 క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Egg Curry Without Masala recipe in telugu make in this way
Egg Curry Without Masala

కోడిగుడ్డు పులుసు త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కొద్దిగా ప‌సుపు, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇందులో ఉడికించిన కోడిగుడ్ల‌ను వేసి గోల్డెన్ క‌ల‌ర్ లోకి వ‌చ్చే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.త‌రువాత వీటిని గాట్లు పెట్టి ప‌క్కకు ఉంచాలి. త‌రువాత మ‌రో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన త‌రువాత‌ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసుకుని వేసుకోవాలి.

త‌రువాత ఉప్పు, ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, మెంతి పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. ఇలా వేయించిన త‌రువాత చింత‌పండు రసం, నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత వేయించిన కోడిగుడ్ల‌ను వేసి క‌ల‌పాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీరను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు పులుసు త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన కోడిగుడ్డు కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts