Onions For Hair : జుట్టు రాలడం, జుట్టు పలుచగా ఉండడం వంటి సమస్యలతో బాధపడే వారు ఈ చిన్న చిట్కాను వాడడం వల్ల చక్కటి ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. ఈ చిట్కాను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అలాగే మరొకరి అవసరం లేకుండా చాలా సులభంగా ఉపయోగించవచ్చు. అలాగే ఈచాలా తక్కువ ఖర్చులో తయారు చేసుకోవచ్చు. ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. ఈ చిట్కాను వాడడం వల్ల మనం మంచి ఫలితాలను పొందవచ్చు. మన జుట్టును ఒత్తుగా, ఆరోగ్యంగా, ధృడంగా మార్చే ఈ చిట్కా ఏమిటి… దీనిని ఎలా తయారు చేసుకోవాలి…అలాగే ఎలా వాడాలి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. జుట్టు రాలడం, జుట్టు బలహీనంగా మారడం వంటి వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు. మారిన మన ఆహారపు అలవాట్లే జుట్టు సంబంధిత సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. చక్కటి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల జుట్టుకు తగిన పోషకాలు అందక జుట్టు ఎక్కువగా రాలుతుంది. ఎక్కువగా దెబ్బతింటుంది. జుట్టు రాలకుండా ఉండాలంటే మనం జుట్టుకు పోషకాలను అందించాలి. జుట్టుకు కావల్సిన పోషకాలను కలిగి ఉండే వాటిల్లో ఉల్లిపాయ ఒకటి. ఉల్లిపాయ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చక్కగా పనిచేస్తుంది.
జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఉల్లిపాయతో నీటిని తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఈ నీటిని తయారు చేసుకోవడానికి గానూ ముందుగా మధ్యస్థంగా ఉండే మూడు ఉల్లిపాయలను తీసుకోవాలి. తరువాత వాటిపై ఉండే పొట్టును తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి ఉల్లిపాయ ముక్కలను ఉడికించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి నీటిని వడకట్టాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ నీరు తయారవుతుంది. ఈ నీరు గోరు వెచ్చగా అయిన తరువాత జుట్టుకు పట్టించాలి. అయితే ఈ ఉల్లిపాయ నీటిని జుట్టుకు పట్టించేటప్పుడు జుట్టుకు నూనె లేకుండా చూసుకోవాలి.
ఈ నీటిని జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు పట్టించాలి. తరువాత జుట్టు కుదుళ్లల్లోకి ఇంకేలా మర్దనా చేసుకోవాలి. ఈ నీటిని రెండు గంటల పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారినికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టుకు కావల్సిన పోషకాలు అంది జుట్టు రాలడం తగ్గుతుంది. ఈ విధంగా ఉల్లిపాయలతో నీటిని తయారు చేసుకుని వాడడం వల్ల మనం అందమైన, ఒత్తైన, ఆరోగ్యవంతమైన జుట్టును సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.